ఈ సంవత్సరంలోనే జాన్వీ పెళ్లి?
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ఈ ఏడాది పెళ్లాడేస్తుందంటూ ఒక జ్యోశ్యుడు చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.
By: Tupaki Desk | 16 Jun 2025 2:00 AM ISTతారల జీవితాలపై కొందరు జ్యోతిష్కుల ప్రకటనలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి. అక్కినేని కుటుంబంపై వేణుస్వామి అనే హైదరాబాదీ జ్యోతిష్కుడు సంచలనం సృష్టించే విషయాలను చెప్పడం, అతడిపై చర్యలు తీసుకోవడం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య- శోభిత జంటపైనా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేయగా, అతడు చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ఈ ఏడాది పెళ్లాడేస్తుందంటూ ఒక జ్యోశ్యుడు చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. జాన్వీ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుంది.. ఒకవేళ ఇప్పుడు అవ్వకపోతే జాన్వీకి 33వయసులో పెళ్లవుతుందని కూడా అతడు సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. జాన్వీ వైవాహిక జీవితం చాలా బావుంటుందని, ఒక్కోసారి గ్రహగతులు మారే క్రమంలో సంసారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యేందుకు అవకాశముందని కూడా అంచనా వెలువరించారు.
సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో ఒక జ్యోతిష్కుడి అంచనా ఇది. అలాగే జాన్వీ కపూర్ స్టార్ డమ్ అసాధారణంగా వెలిగిపోతుందని, తన సహచరుల కంటే జాన్వీ చాలా ముందుంటుందని కూడా పాజిటివ్ నోట్ చెప్పాడు. 2026 మధ్యకాలం తర్వాత జాన్వీ గొప్ప స్టార్ గా ఎదుగుతుందని అన్నాడు.
అయితే ఇలాంటి జ్యోతిష్య అంచనాలను నమ్మదగినవిగా అనిపించవు. ఓవైపు పెళ్లి ఈ ఏడాది చివరిలో చేసుకోవాలని అంటాడు. కానీ 33 వయసులో పెళ్లవుతుందని ఎలా చెబుతాడు? వైవాహిక జీవితం బావుంటుందని అంటాడు. అదే సమయంలో సూర్యచంద్రులు, గ్రహాలు తేడా కొడితే! అంటాడు. అందువల్ల జ్యోతిష్యాన్ని నమ్మాలో నమ్మ కూడదో కొంత గందరగోళం నెలకొంటుంది.
సెలబ్రిటీల కుటుంబ నేపథ్యం, ధనబలం ఇతర బాలాల దృష్ట్యా కొన్ని అంచనాలు నిజం కావొచ్చు. చాలా వరకూ నిరాధారమైన వ్యాఖ్యలు విన్నప్పుడు ఇదెలా సాధ్యం? అనిపించక మానదు. జాన్వీ ఇప్పటికే శిఖర్ పహారియా అనే రాజకీయ నేపథ్యం ఉన్న కుర్రాడితో ప్రేమలో ఉంది. జ్యోతిష్కుడి ప్రకారం.. ఈ ఏడాది పెళ్లాడేస్తుందో లేదో వేచి చూడాలి. అయినా మనిషి భవిష్యత్ వాణి ఎలా చెప్పగలరు? గ్రహగతులు, పుట్టిన తేదీల ఆధారంగా దీనిని వందశాతం పక్కాగా చెప్పగలిగే జ్యోతిష్యుడు ఇంకా పుట్టలేదు. కొన్ని స్పెక్యులేషన్స్ నిజాలు కావొచ్చు. రొమానియన్ బాబా వంగా చెప్పినట్టు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు జ్యోతిష్యం చెప్పగలరా వీరంతా?
