జెన్ జెడ్ ఫ్యాషనిస్టా జాన్వీ స్టైలిష్ లుక్
ఇప్పుడు జాన్వీ లేటెస్ట్ ఇన్ స్టా లుక్ ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతోంది. జాన్వీ వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్స్ తో గుబులు రేపే ఫోజులిచ్చింది.
By: Tupaki Desk | 13 Jun 2025 10:35 PM ISTఫ్యాషనిస్టా జాన్వీ కపూర్ నిరంతర ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ యువతరానికి స్ఫూర్తి. నేటి జెన్ జెడ్ ఫ్యాషనిస్టాగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇప్పుడు జాన్వీ లేటెస్ట్ ఇన్ స్టా లుక్ ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతోంది. జాన్వీ వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్స్ తో గుబులు రేపే ఫోజులిచ్చింది.
ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యాషన్ ఈవెంట్లు గేమ్ ఏదైనా దేనినీ విడిచిపెట్టదు జాన్వీ. ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్ `పెద్ది` కోసం కఠినంగా శ్రమిస్తోంది. బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దేవర లాంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన జాన్వీ, వెంటనే చరణ్ సరసన పెద్దిలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అవకాశం దక్కించుకుందని ప్రచారం ఉంది.
నటిగా జాన్వీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. తెలుగు చిత్రసీమలో మామ్ శ్రీదేవికి ఉన్న ఇమేజ్ కారణంగా జాన్వీ పై అంచనాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇక సహచరులతో పోటీపడుతూ దూసుకెళ్లేందుకు జాన్వీ చాలా క్రమశిక్షణతో కఠినంగా శ్రమిస్తుంది. ఇక తను అనుసరించే ప్రమోషనల్ టెక్నిక్స్ కూడా పెద్ద అస్సెట్.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... తదుపరి జాన్వీ పలు భారీ చిత్రాల్లో నటించనుందని కథనాలొస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి `కర్ణ` అనే భారీ చిత్రంలో నటించేందుకు అవకాశం ఉంది. టైగర్ ష్రాఫ్ సరసన ఓ రొమాంటిక్ కామెడీలో నటించనుంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తారు.
