Begin typing your search above and press return to search.

జాన్వీకి 5కోట్ల ఖ‌రీదైన లంబోర్ఘిని గిఫ్ట్.. ఇచ్చింది ఎవ‌రో తెలుసా?

ఇప్పుడు బిర్లా కుటుంబ వార‌సురాలితోను జాన్వీ స్నేహం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బిర్లాల కుమార్తె జాన్వీకి ఇచ్చిన గిఫ్ట్ మ‌తి చెడ‌గొడుతోంది.

By:  Tupaki Desk   |   12 April 2025 9:19 AM IST
జాన్వీకి 5కోట్ల ఖ‌రీదైన లంబోర్ఘిని గిఫ్ట్.. ఇచ్చింది ఎవ‌రో తెలుసా?
X

సంఘంలో హైప్రొఫైల్స్ స్నేహాలు, ఖ‌రీదైన కానుక‌లు ఎల్ల‌పుడూ అందరి దృష్టినీ ఆక‌ర్షిస్తాయి. ఇక్క‌డ అలాంటి ఒక హై ప్రొఫైల్ గిఫ్ట్ అందుకుంది జాన్వీ క‌పూర్. ప‌రిశ్ర‌మ‌లో రైజింగ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న జాన్వీ క‌పూర్, ఇటీవ‌ల టాలీవుడ్ లో వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఈ బ్యూటీ త‌న సంపాద‌న‌ను తెలివిగా ముంబైలోని రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెడుతూ భారీగా లాభాలార్జిస్తోంది.

ఇక జాన్వీక‌పూర్ త‌న స్నేహితురాళ్ల‌తో స‌త్సంబంధాల‌ను కొన‌సాగించ‌డంలో ఎంతో నేర్ప‌రి. ప‌రిశ్ర‌మ‌లో అన‌న్య పాండే, సారా అలీఖాన్, సుహానా, స‌న‌యా క‌పూర్ స‌హా చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ కుటుంబంలోను త‌న‌కు గొప్ప స్నేహితులు ఉన్నారు. అటు ప్ర‌పంచ కుభేరులు అంబానీ కుటుంబంలోను జాన్వీకి స్నేహితులు ఉన్నారు. అంబానీ కూతురు, కోడ‌లుతోను జాన్వీ క‌పూర్ ఎంతో స‌న్నిహితంగా ఉంటుంది.

ఇప్పుడు బిర్లా కుటుంబ వార‌సురాలితోను జాన్వీ స్నేహం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బిర్లాల కుమార్తె జాన్వీకి ఇచ్చిన గిఫ్ట్ మ‌తి చెడ‌గొడుతోంది. జాన్వీ కపూర్ శుక్రవారం ఖ‌రీదైన‌ లంబోర్గిని కార్ ని కానుక‌గా అందుకుంది. దీని ధ‌ర‌ రూ.4 కోట్ల నుండి రూ.4.99 కోట్ల మధ్య ఉంటుంద‌ని స‌మాచారం. ఇది అత్యంత విలాసవంతమైన కార్. ఈ గిఫ్ట్ ఇచ్చింది ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. జాన్వీకి అత్యంత‌ సన్నిహిత స్నేహితురాలు అనన్య బిర్లా ఈ కానుక‌ను ఇచ్చారు. ఇది జాన్వీ అద్భుతమైన హై-ఎండ్ కార్ల వ‌రుస‌లో రాజ‌సాన్ని పెంచింది. జాన్వీ కొత్త కారును ఆమె ముంబై నివాసానికి తీసుకెళ్లిన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఆ కారుతో పాటు ``ప్రేమతో అనన్య బిర్లా`` అనే ట్యాగ్‌తో కూడిన పెద్ద లిలక్ గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది.

జాన్వీ- అనన్య బిర్లా చాలా కాలంగా స్నేహితులు. కుమార్ మంగళం బిర్లా, నీర్జా బిర్లా కుమార్తె అనన్య.. ఒక వ్యాపారవేత్తగా, సంగీత కళాకారిణిగా రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. బిర్లాల వార‌సురాలైన అన‌న్య‌ 2016లో జిమ్ బీన్జ్ నిర్మించిన తన తొలి సింగిల్ `లివిన్- ది లైఫ్`తో సంగీత ప్ర‌పంచంలో అడుగుపెట్టింది. `మీంట్ టు బి` సహా అన‌న్య నెక్ట్స్ సింగిల్స్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. భారతదేశంలో ఆంగ్ల భాషా సింగిల్‌కు ప్లాటినం హోదాను సాధించిన మొదటి భారతీయ కళాకారిణిగా ఈ భామ‌కు గుర్తింపు ద‌క్కింది.

మ‌రోవైపు జాన్వీ క‌పూర్ త‌న త‌దుప‌రి టాలీవుడ్ చిత్రం పెద్ది చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉంది. సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరం సుందరి వంటి చిత్రాలలోను నటిస్తోంది. కేన్స్ 2025లో `అన్ సెర్టైన్ రిగార్డ్` విభాగంలో పోటీకి దిగుతున్న `హోమ్‌బౌండ్`లో జాన్వీ ప్రత్యేక పాత్రను పోషించింది.