జాన్వీ కోలీవుడ్ డెబ్యూ ఆ హీరోతోనా?
ఈ నేపథ్యంలో రెండవ కుమార్తె నైనా తమిళ్ లో లాంచ్ చేసి...టాలీవుడ్ తో బ్యాలెన్స్ చేయాలని బోణీ కపూర్ భావించారు.
By: Tupaki Desk | 27 May 2025 8:00 PM ISTజాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ ప్రయత్నాలు మొదలు పెట్టిందా? చెల్లెలు ఖుషీ కపూర్ కంటే ముందుగానే అక్క లాంచ్ అవుతుందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్...టాలీవుడ్ కెరీర్ దేదీ ప్యమా నాంగా సాగిపోతుంది. రెండు భాషల్లోనూ బిజీ నాయికగా కొనసాగుతుంది. `దేవర` చిత్రంతో పాన్ ఇండియాలోనూ పరిచయమైంది. ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడీగా పెద్దిలో నటిస్తుంది.
ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో జాన్వీ పెర్పార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అన్న ఆసక్తి నెలకొంది. జాన్వీ నేడు ఇంత బిజీ అయిందంటే అందుకు కారణం డాడ్ బోనీకపూర్ ప్లానింగ్. తండ్రి సూచనలు.. సలహాలు పాటిస్తూనే ఈ దశకే చేరుకుంది. అయితే కోలీవుడ్ లో మాత్రం ఇంకా లాంచ్ అవ్వలేదు. తొలుత అక్కడే లాంచ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యపడలేదు.
ఈ నేపథ్యంలో రెండవ కుమార్తె నైనా తమిళ్ లో లాంచ్ చేసి...టాలీవుడ్ తో బ్యాలెన్స్ చేయాలని బోణీ కపూర్ భావించారు. కానీ అంతకంటే ముందే జాన్వీ లాంచ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇటీవలే బోణీ కపూర్ చెన్నైలో ధనుష్ తో భేటీ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగా జాన్వీ కపూర్ డెబ్యూ విషయంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది.
అదే నిజమైతే ధనుష్ 57వ చిత్రంతోనే జాన్వీ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ధనుష్ స్వీయా దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ `ఇడ్లీకడై` చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ పనుల్లో ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఆయనే స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ లో `తేరే ఇష్క్ మే`లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల అనంతరం ధనుష్ 56వ చిత్రం మారిసెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది. అనంతరం 57వ చిత్రం పనుల్లో ధనుష్ బిజీ అవుతాడు.
