సోదరి ఓ వైపు.. ప్రియుడు మరో వైపు.. జాన్వీ దిల్‌సే!
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
By: Tupaki Desk | 20 Jun 2025 10:22 AM ISTఓవైపు సిస్టర్ ఖుషి.. మరో వైపు ప్రియుడు శిఖర్ పహారియా.. జాన్వీ లైఫ్‌స్టైల్ నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ఈ భామ నిరంతరం తన సోదరి ఖుషీని విడిచి ఉండలేదు. అదే సమయంలో తన ప్రియుడు శిఖర్ తన చెంత లేకపోయినా ఏమీ తోచని స్థితిలో ఉంటుంది.
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జాన్వీ తన సోదరితో కలిసి వెకేషన్ ని ఆస్వాధిస్తున్న ఫోటోలతో పాటు, ఇదే బంచ్ లో ప్రియుడు శిఖర్ తో కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాధిస్తున్న వీడియో కూడా ఉంది. ఆహ్లాదకరమైన ఆ సమయంలో శిఖర్ ప్లేట్ లోంచి తనకు ఇష్టమైన దానిని స్పూన్ తో లాక్కుని లాగించేస్తోంది జాన్వీ. శిఖర్ తన ప్రేయసిని తథేకంగా చూస్తుంటే, అసలు ఇది కదా ప్రేమ అంటే! అని డెఫినిషన్ ని మార్చాల్సి వస్తోంది.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ స్టైల్, ఫ్యాషన్ సెన్స్, జీవన శైలి ప్రతిదీ నేటితరానికి స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. జాన్వీ చిన్న వయసులో స్టార్ డమ్ ని ఆస్వాధిస్తోంది. ఏ వయసులో చేయాల్సినది ఆ వయసులో చేస్తోంది. లవ్ కెరీర్ జోష్ ఇవన్నీ పాతిక వయసులోపే జాన్వీ తన సొంతం చేసుకుంది. ఇది రేర్ ఆపర్చునిటీ.
ఇక జాన్వీ, ఖుషీ లైఫ్ స్టైల్ ని ఈ స్థాయిలో డిజైన్ చేసింది మాత్రం పాపా బోనీకపూర్. ఒక బిజినెస్ మేన్ గా అతడు తన కుమార్తెల కెరీర్ ని డిజైన్ చేసిన తీరు ఆశ్చర్యపరచకుండా ఉండదు. జాన్వీ ఇప్పుడు హిందీ, తెలుగు చిత్రసీమల్లో బిజీ కథానాయిక. ఖుషీ కపూర్ తన సోదరిని ఫాలో అవుతోంది. ఇదంతా పైనుంచి మామ్ శ్రీదేవి గమనిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జాన్వీ-ఖుషి- శిఖర్ .. వారి విహార యాత్రకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. జాన్వీ ప్రస్తుతం చరణ్ సరసన పెద్ది అనే చిత్రంలో నటిస్తోంది. ఖుషీ కపూర్ తదుపరి సినిమా కథా చర్చల్లో బిజీ గా ఉంది.
