జూనియర్ అతిలోక సుందరి వైబ్స్
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా సినీ ఆరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తనను తాను నటిగా నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది.
By: Tupaki Desk | 8 Jun 2025 8:45 AM ISTనేటి జెన్ జెడ్ స్టార్లలో దూసుకుపోయే తత్వం జాన్వీకపూర్ కి ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా సినీ ఆరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తనను తాను నటిగా నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అదే సమయంలో జాన్వీ నిరంతర ఫ్యాషన్ సెన్స్ తో ప్రజల దృష్టిని తనవైపు తిప్పేసుకోవడంలో పెద్ద సక్సెసైంది.
ఇప్పుడు మరోసారి జాన్వీ తనదైన యూనిక్ స్టైల్ తో కనిపించింది. ఈ బ్యూటీ ``జగదేక వీరుడు - అతిలోక సుందరి`` పోస్టర్ ప్రింట్ చేసి ఉన్న క్లాసిక్ డెనిమ్ జీన్స్ షర్ట్ ధరించి కనిపించింది. డెనిమ్స్ షర్ట్ వెనక భాగంలో ఈ పోస్టర్ ముద్రించి ఉండటం ఆసక్తికరం. ఈ స్పెషల్ డెనిమ్ జాకెట్ అంటే తనకు చాలా ఇష్టం అని జాన్వీ తెలిపింది. శ్రీదేవిని `ఒక దేవదూత అద్భుత యువరాణి` అని ప్రశంసించారు. చిరంజీవి -శ్రీదేవితో పాటు ఈ పోస్టర్ లో నాటి మేటి విలన్ అమ్రీష్ పురి ఫోటో కూడా ఉంది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. ఈ బ్యూటీ తదుపరి రామ్ చరణ్ తో కలిసి `పెద్ది`లో కనిపిస్తుంది. ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ని తెరకెక్కిస్తే నటించేందుకు సిద్ధమేనని కూడా జాన్వీ ఇంతకుముందు చెప్పింది. రామ్ చరణ్- జాన్వీ కపూర్ జంటగా జగదేక వీరుడు సీక్వెల్ ని తెకెక్కిస్తే బావుంటుందని చిరు కూడా సూచించారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇంకా చాలా సమయం పడుతుంది.
