మహిళా నిర్మాతపై జాన్వీ కపూర్ కామెంట్
జాన్వీ కపూర్ - ఇషాన్ ఖట్టర్ నటించిన `హోమ్‌బౌండ్` కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2025 8:30 AM ISTజాన్వీ కపూర్ - ఇషాన్ ఖట్టర్ నటించిన `హోమ్‌బౌండ్` కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమయిన సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శనకు ముందు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియా, స్నేహితుడు ఒర్రీతో ఫ్రెంచ్ రివేరాలో సందడి చేసారు. జాన్వీ మూవీకి వీరంతా ప్రచార సాయానికి విచ్చేసారు.
ఆ తర్వాత జాన్వీ వరుసగా రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ లతో మతులు చెడగొట్టిన సంగతి తెలిసిందే. జాన్వీ చివరిగా బ్లాక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో కనిపించింది. దీనిలో రెట్రో అప్పియరెన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఈవెంట్ నుంచి ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
శుక్రవారం జాన్వీ బ్లాక్ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. తన స్టైలిష్ ఫోటోలను షేర్ చేసిన జాన్వీ ``ముంబై వర్షాలకు సిద్ధంగా ఉంది ..రియా క్యాప్షన్ కోసం నన్ను చంపకు`` అని రాసింది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ కం నిర్మాత రియా కపూర్ ని ఉద్ధేశిస్తూ జాన్వీ చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.
కేన్స్ లో జాన్వీ నటించిన హోమ్ బౌండ్ ని ప్రదర్శించాక, 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ లభించింది. నీరజ్ ఘయ్వాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇది ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. తాజాగా రిలీజైన ఫోటోలలో జాన్వీ, ఇషాన్ ఖట్టర్, కరణ్ జోహార్, చిత్రనిర్మాత నీరజ్ ఘయ్వాన్ మరియు ఇతరులతో కలిసి పోజులిచ్చినట్లు కనిపిస్తుంది.
