టిప్పు టాప్పు సుందరి.. వాటీజ్ దిస్ అమ్మోవ్
అందంతో కవ్విస్తోంది.. గ్లాడ్ రాగ్ కవర్ గాళ్ లా చెలరేగిపోతోంది.. ఎవ్వర్ లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్ తో మతి చెడగొడుతోంది.. ఎవరు ఈ టిప్పు టాప్పు సుందరి? వయ్యారాల వడ్డనలు.. తళాంగు తైతక్కలు!
By: Tupaki Desk | 7 Jun 2025 9:26 AM ISTఅందంతో కవ్విస్తోంది.. గ్లాడ్ రాగ్ కవర్ గాళ్ లా చెలరేగిపోతోంది.. ఎవ్వర్ లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్ తో మతి చెడగొడుతోంది.. ఎవరు ఈ టిప్పు టాప్పు సుందరి? వయ్యారాల వడ్డనలు.. తళాంగు తైతక్కలు!
టీనేజీ మిసమిసలతో టెంప్టింగ్ చేయడంలో, మడోన్నా ఊపులతో అదరగొట్టేయడంలో ఈ అమ్మడిని కొట్టేవాళ్లే లేరు. అయినా మామ్ శ్రీదేవితో పోలిస్తే జాన్వీలోని ఈ విలక్షణాలే ఇప్పుడు ఇండస్ట్రీలో హైలో ఉంచుతున్నాయ్. నేటితరం ఫ్యాషనిష్టాల్లో జాన్వీ కపూర్ తన యూనిక్ నెస్ ని కాపాడుకుంటూ ఔరా! అనిపిస్తోంది.
ప్రతిరోజూ ఏదో ఒక డిజైనర్ లుక్ తో ప్రజల కళ్లన్నీ తనవైపే తిప్పేసుకోవడంలో జాన్వీ తెలివితేటల్ని మెచ్చకుండా ఉండలేరు ఎవరూ.. బాలీవుడ్ బెస్ట్ డిజైనర్లు జాన్వీ కపూర్ కోసం స్పెషల్ లుక్స్ డిజైన్ చేస్తున్నారు. ఓవరాల్ గా జాన్వీ కొంత గ్యాప్ తర్వాత ఫ్యాషన్ గేమ్ ని మరో లెవల్ కి చేర్చింది. ఈ కొత్త లుక్ చూడగానే యూత్ గుండెల్లో గిలిగింతలే గిలిగింతలు.... ఏంజెలినా, జెన్నిఫర్.. అన్నా హత్ వే.. వీళ్లెవరైనా సరిపోతారా జాన్వీ ముందు? డార్క్ పింక్ స్పెషల్ ఫ్రాక్ లో గుబులు పెంచుతోంది!
ఇంటర్నెట్ లో నిరంతరం ఏదో ఒక కోణంలో తన గురించి చర్చించుకునేలా చేయడంలో జాన్వీ యూనిక్ వే అందరికీ ఆదర్శం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ది (రామ్ చరణ్) చిత్రానికి జాన్వీ పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు. దేవరతో ఎన్టీఆర్‌ని, పెద్దితో రామ్ చరణ్ ని లాక్ చేసిన జాన్వీ నెక్ట్స్ టార్గెట్ అల్లు అర్జున్. ఆఫర్ కోసం జాన్వీ వెయిటింగ్. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
