కేన్స్‌లో జాన్వీ మ్యావ్ మ్యావ్ లుక్
రెడ్ కార్పెట్ ఈవెంట్లలో షో స్టాపర్‌గా ఎలా కనిపించాలో జాన్వీకి తెలిసినంతగా ఇతరులకు తెలీదేమో.
By: Tupaki Desk | 22 May 2025 8:15 AM ISTరెడ్ కార్పెట్ ఈవెంట్లలో షో స్టాపర్‌గా ఎలా కనిపించాలో జాన్వీకి తెలిసినంతగా ఇతరులకు తెలీదేమో. కేన్స్ 2025 ఉత్సవాలకు కొత్త కళ తెచ్చింది ఈ బ్యూటీ. ఈసారి కేన్స్ 2025 ప్రయాణానికి కొత్త మైలురాయిని జాన్వీ జోడించింది.
మొదటిసారి కేన్స్ ఉత్సవాల్లో పాల్గొంటున్న జాన్వీకి తన సత్తా చాటే ఛాన్స్ వచ్చింది. ఇప్పటికే జాన్వీ లుక్స్ కి సంబంధించిన ప్రధాన అప్ డేట్స్ రివీలవుతూనే ఉన్నాయి. జాన్వీ ఈసారి మ్యావ్ మ్యావ్ తరహాలో తల నుండి కాలి వరకు దుస్తులు ధరించిన మొదటి బాలీవుడ్ నటిగా నిలిచింది. ఫ్రెంచ్ రివేరాలో ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రచారకర్తగాను జాన్వీ కనిపించింది.
కజిన్ రియా కపూర్ డిజైన్ చేసిన దుస్తుల్లో జాన్వీ ఇలా `మ్యావ్ మ్యావ్ డిన్నర్ లుక్`తో అందంగా కనిపించింది. సందర్భానికి మ్యాచింగ్ గా స్లీవ్‌లెస్ టాప్ - తెల్లటి నిట్ మినీ స్కర్ట్‌ను ఎంచుకుంది. గోధుమ రంగు హ్యాండ్‌బ్యాగ్, చిక్ బ్లాక్ సన్ గ్లాసెస్ .. మెరిసే మేకప్ తో డిన్నర్ వేకేలో జాన్వీ అందంగా కనిపించింది. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతున్న పెద్దిపై జాన్వీ చాలా హోప్స్ పెట్టుకుంది. దేవర తర్వాత తనకు ఇది చాలా కీలకమైన సినిమా కాబోతోంది.
