జాన్వీ స్పెషల్ షో.. ఆచ్ఛాధనే లేని వీపందం
కేన్స్ 2025 ఉత్సవాల్లో భారతదేశం నుంచి టాప్ సెలబ్రిటీలు అటెండవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 May 2025 11:16 PM ISTకేన్స్ 2025 ఉత్సవాల్లో భారతదేశం నుంచి టాప్ సెలబ్రిటీలు అటెండవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐశ్వర్యారాయ్, అదితీరావ్ హైదరీ, నందిత దాస్ లాంటి నటీమణులు తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. ఇప్పుడు జాన్వీ వంతు. అతిలోక సుందరి నటవారసురాలు జాన్వీ కపూర్ ఎప్పటిలానే కేన్స్ ఉత్సవాల్లో కూడా తనదైన యూనిక్ నెస్ తో ఆకర్షిస్తోంది. ఇప్పటికే రకరకాల డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై వాక్ చేస్తూ మతులు చెడగొడుతోంది.
ప్రఖ్యాత ఫెమీనా మ్యాగజైన్ తమ ఇన్ స్టాగ్రమ్ పేజీలో జాన్వీ కొత్త లుక్ ని షేర్ చేసింది. కేన్స్ డే 2 లో #జాన్వి కపూర్ లేక్ ఇది. జాన్వి సాంప్రదాయ ఆర్కైవల్ ఇండియన్ ఆభరణాలు, కస్టమ్ జాడే - కరోకే క్రియేషన్ల మిశ్రమంతో అనామికా ఖన్నా కస్టమ్ కోచర్ ధరించింది. ఈ రెండవ లుక్ మొదటి లుక్ లాగే అద్భుతంగా ఉంది. జాన్వి ఫ్రెంచ్ రివేరాను తన వ్యక్తిగత రన్‌వేగా మార్చుకుంది... అని వ్యాఖ్యను జోడించారు.
జాన్వీ వెనక భాగంలో ఆచ్ఛాధన అన్నదే లేకుండా అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ వీపు సొగసు ఆకర్షిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేన్స్ లో నేలను స్వీప్ చేసే పొడవాటి దుస్తులు ధరించకూడదనే నియమం ఉండగా, జాన్వీ కపూర్ ఇలాంటి పొడవైన లెహంగాలను ఎలా ధరిస్తోంది? అనే సందేహాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ ధరించిన లెహంగా, జాన్వీ ఎంచుకున్న దుస్తులు, స్టైల్ చర్చగా మారాయి.
