కేన్స్ 2025 లుక్ గుట్టు విప్పిన జాన్వీ
జాన్వి కపూర్ తన దివంగత తల్లి శ్రీ దేవిలా కనిపించాలనేది వారందరి కాన్సెప్ట్.
By: Tupaki Desk | 22 May 2025 9:46 AM ISTకేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో జాన్వీ కపూర్ అరంగేట్రం అద్భుతంగా వర్కవుటైంది. ఈ భామ డిజైనర్ లుక్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన బ్లష్ పింక్ త్రీ పీస్ ఎథ్నిక్ దుస్తుల్లో తొలి షోలోనే చెరగని ముద్ర వేసిన జాన్వీ షో స్టాపర్ గా కనిపించింది. ఎర్రటి శాటిన్లు, తెల్లటి ముత్యాల చిక్‌తో డిజైన్ చేసిన గౌనులో రెడ్ కార్పెట్‌పై అందంగా హొయలుపోయింది జాన్వీ. ఫ్రెంచ్ రివేరాలో రాయల్ కోర్ కోచర్ వైబ్స్ తో అలరించింది.
తన సినిమా `హోంబౌండ్` ప్రచారంలోను జాన్వీ నిమగ్నమైంది. తరుణ్ తహిలియానీ డిజైన్స్ తో పాటు, తన కజిన్ , సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ స్టైలింగ్ చేసిన దుస్తుల్లోను జాన్వీ మెరుపులు మెరిపించింది. పింక్ డిజైనర్ రాయల్ కోచర్ రూపకల్పనలో తరుణ్- రియా క్రియేటివిటీ కూడా వర్కవుటైంది.
అయితే ప్రపంచ స్థాయి నటీమణులు కొలువు దీరిన వేదికపై జాన్వీ షో స్టాపర్ గా నిలవడానికి కారణం డిజైనర్ల ఆలోచన.. ఎంపికలు. జాన్వి కపూర్ తన దివంగత తల్లి శ్రీ దేవిలా కనిపించాలనేది వారందరి కాన్సెప్ట్. దానికి తగ్గట్టే దివంగత నటి, జాన్వీ తల్లిగారైన శ్రీదేవి గత ఫ్యాషన్ ఎంపికలను పరిశీలించి కొత్త డిజైన్ లను రూపొందించారు. శ్రీదేవికి సారూప్యంగా కనిపించి, శ్రీ దేవి ఫ్యాషన్ ఎంపికలు, బ్యూటీ గేమ్‌ను ఎంపిక చేసుకోవడం జాన్వీకి అదనంగా కలిసొచ్చింది. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్, సావ్లీన్ మంచాంద జాన్వి లుక్ కు 90ల నాటి శ్రీదేవి స్ఫూర్తిదాయకమైన గ్లామ్ ను జోడించారు. కాంస్య రంగు, గోధుమ రంగు, క్రోమ్ ఐషాడోలను ఉపయోగించి జాన్వీ లుక్ ని మార్చేసారు. మొత్తానికి ఫ్రెంచ్ రివేరాలో దేవర - పెద్ది చిత్రాల నటి ఒక రేంజులో మెరుపులు మెరిపించింది.
