Begin typing your search above and press return to search.

తెలుగు దర్శకుడితో జాన్వీ.. ఏఎంబీ సినిమాస్ లో సర్ ప్రైజ్!

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది.

By:  Tupaki Desk   |   26 July 2025 11:25 AM IST
తెలుగు దర్శకుడితో జాన్వీ.. ఏఎంబీ సినిమాస్ లో సర్ ప్రైజ్!
X

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది. మొదటి సినిమానే ఎన్టీఆర్‌తో దేవర, ఆ తర్వాత రెండో సినిమాగా రామ్ చరణ్ పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇలా టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందుకుంటూ సౌత్ ఆడియన్స్‌కి కూడా దగ్గరైపోతుంది. జాన్వీ గ్లామర్‌తో పాటు తన కొత్త లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు హైదరాబాద్‌లో పెద్ది సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ కోసం జాన్వీ కపూర్ టీమ్‌తో కలిసి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే దర్శకుడు బుచ్చిబాబు సనా, జాన్వీ కపూర్‌తో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో జాన్వీ సింపుల్ పింక్ జాకెట్, బ్లాక్ జీన్స్‌లో కనిపించింది. సింపుల్ గ్లామర్ లుక్‌లో కూడా ఎంత క్యూట్ గా, ఎట్రాక్టివ్‌గా ఉందనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి సినిమా థియేటర్‌లో కనిపించడంతో, ఏ సినిమా చూసారోనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో క్లిక్ అయిన ప్రదేశం హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్. శుక్రవారం జాన్వీ, బుచ్చిబాబు అక్కడ కనిపించడం విశేషం. అయితే ఆ సమయంలో థియేటర్లో ఏ సినిమా ప్రివ్యూకు వెళ్లారో స్పష్టత లేదు.

కొందరు ఫ్యాన్స్ మాత్రం హరి హర వీరమల్లు చూసారని అంటుండగా, మరికొందరు వేరే మూవీ అని అభిప్రాయపడుతున్నారు. ఏదైనా జాన్వీ కపూర్ క్యాజువల్ లుక్‌లో కనిపించడం మోడ్రన్ యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది. ఇప్పుడు పెద్ది సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ముఖ్యంగా కీలక సాంగ్ షూట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా కనిపించనుండటంతో, ఈ కాంబోలో వస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండటంతో పాటలకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడుతోంది. దివ్యేండూ శర్మ, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పెద్ది సినిమాపై మేకర్స్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూరల్ మాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. జాన్వీ కపూర్ తక్కువ కాలంలోనే తెలుగులో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ పట్టేసింది. పైగా ఇప్పుడు పారితోషికం కూడా ఒక్కో చిత్రానికి పెంచేస్తుండటంతో ఇండస్ట్రీలో బజ్‌కు కారణమవుతోంది. మరి అమ్మడి సెకండ్ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.