Begin typing your search above and press return to search.

ఆదర్శంగా నిలుస్తున్న జాన్వీ కపూర్.. ఇకనైనా వారిలో మార్పు వస్తుందా?

జాన్వీ కపూర్.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ చిన్నది.

By:  Tupaki Desk   |   9 Sept 2025 4:00 PM IST
ఆదర్శంగా నిలుస్తున్న జాన్వీ కపూర్.. ఇకనైనా వారిలో మార్పు వస్తుందా?
X

జాన్వీ కపూర్.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తన అందంతో అభిమానులను మాయ చేసింది. అటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు శ్రీదేవి కూడా తన కూతురి మొదటి ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తోనే జరగాలి అని, తన కోరికను జూనియర్ ఎన్టీఆర్ తో చెప్పిందట. ఆయన ఈ విషయాన్ని గతంలో చెప్పగా.. జాన్వీ కపూర్ కూడా తన తల్లి కోరికను నెరవేరుస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యింది.

అలా మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈమె.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు అటు నాని సినిమాలో కూడా అవకాశం అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 5కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈమె నిర్మాతల మనిషి అంటూ ఈమె తండ్రి బోనీకపూర్.. ఈమె గురించిన అసలు విషయాన్ని బయట పెట్టారు.

విషయంలోకి వెళ్తే. పుష్ప 2, యానిమల్, ఛావా వంటి చిత్రాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి రికార్డులు ఏవి క్రియేట్ చేయకపోయినా.. కేవలం తనకున్న క్రేజ్ కారణంతోనే తెలుగు తొలి చిత్రం దేవర కోసం ఏకంగా రూ.5కోట్లు తీసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది జాన్వీ కపూర్. ఇకపోతే జాన్వీ కపూర్ కి మొదటి సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడంతో.. కొంతమంది వ్యతిరేకత సృష్టించారు కూడా.. కానీ అసలు విషయాన్ని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు బోనీకపూర్.

బోనీ కపూర్ మాట్లాడుతూ.." సాధారణంగా ఒక హీరోయిన్ సినిమాలో నటిస్తోంది అంటే.. ఆమెకు ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా మిగతా ఖర్చులు కూడా నిర్మాతలు భరించాల్సి ఉంటుంది. కానీ జాన్వీ కపూర్ అలా కాదు.. తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ లోనే సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు తన ఖర్చులు తానే స్వయంగా భరించుకుంటుంది. ముఖ్యంగా విదేశాలలో షూటింగ్ జరగాల్సి వస్తే.. ఫ్లైట్ టికెట్లు మొదలుకొని ప్రతీది కూడా ఆమె సొంతంగా భరిస్తుంది. దీనికి తోడు తనతో పాటు ఎవరినైనా తీసుకువెళ్లినా.. వారి ఖర్చులు కూడా ఆమె భరిస్తుంది." అంటూ ఆమె గొప్ప మనసును అందరికీ తెలిసేలా చేశారు బోనీకపూర్. అంతేకాదు తన తల్లి శ్రీదేవి ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఆమె.. తన తండ్రి నిర్మాత కావడంతో అక్కడ వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా చూసింది కాబట్టే ఇతర నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదని సొంత ఖర్చులు తానే భరించుకుంటున్నట్లు కూడా తెలిపారు నిర్మాత బోనికపూర్.

ప్రస్తుతం ఈ విషయం తెలిసి జాన్వీ కపూర్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి హీరోయిన్లు సినిమాలో నటిస్తున్నారు అంటే తమతో పాటు వచ్చే వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మేకప్ ఆర్టిస్టులకు నిర్మాతలే ఖర్చులు భరించాలి. ఫ్లైట్ టికెట్లు మొదలుకొని.. బస చేయడానికి హోటల్ గదుల రెంట్లు కూడా వారే కట్టాలి. అలాంటి డిమాండ్లకు ఒప్పుకుంటేనే హీరోయిన్లు సినిమాలలో చేస్తారు. కానీ వీటన్నింటికి విరుద్ధంగా జాన్వీ కపూర్ ప్రవర్తిస్తోంది . మరి కనీసం ఇప్పటికైనా.. జాన్వీ కపూర్ చేస్తున్న ఈ పనిని దృష్టిలో పెట్టుకొని మిగతా హీరోయిన్స్ కూడా తమ తీరును మార్చుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు నిర్మాతలకు అండగా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది జాన్వీ కపూర్.