బెడ్‌పై జాన్వీ మతి చెడే భంగిమలు
నేటి జెన్ జెడ్ కిడ్స్ లో జాన్వీ కపూర్ స్టైల్ వేరు. ఈ భామ తన కోస్టార్స్ కంటే అన్నిటిలో అడ్వాన్స్ డ్ గా ఉంటుంది.
By: Tupaki Desk | 17 Jun 2025 3:00 AM ISTనేటి జెన్ జెడ్ కిడ్స్ లో జాన్వీ కపూర్ స్టైల్ వేరు. ఈ భామ తన కోస్టార్స్ కంటే అన్నిటిలో అడ్వాన్స్ డ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు స్టన్నింగ్ ఫ్యాషన్ సెన్స్, మేకోవర్ తో కట్టి పడేస్తుంది. స్టైల్ ఐకాన్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జెన్ జెడ్ బ్యూటీ మరోసారి తనదైన స్టైల్ ఎలివేషన్ తో మతులు చెడగొడుతోంది.
జాన్వీ టాప్ లెస్ దుస్తుల్లో కనిపించి టాప్ లేపేసింది. ఈ కపూర్ బ్యూటీ తనలోని ఇన్నర్ సొగసును ఆవిష్కరించే లోదుస్తులను ధరించింది. అయితే ఈ లోదుస్తులను కవరప్ చేస్తూ, బ్లాక్ కలర్ కోట్ ని కూడా జాన్వీ కపూర్ ధరించింది. ఒక ఫోటోలో జాన్వీ ఊలు జాకెట్ ని కూడా ధరించి కనిపించింది. ముఖ్యంగా బెడ్ పై రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చిన జాన్వీ.. రకరకాల డిజైనర్ లుక్స్ లో కనిపించి హృదయాలను కొల్లగొట్టింది.
ఈ ఫోజులు చూడగానే యూత్ జాన్వీ భంగిమలకు మైండ్ బ్లాంక్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ బెడ్ పై జాన్వీ భంగిమలు చూడగానే మతి చెడింది! అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ యువతరం వాట్సాపులు, సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ కపూర్ ఇటీవలే ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించింది. వెంటనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది`లో అవకాశం అందుకుంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు చరణ్ తో షూటింగ్ లో పాల్గొంటూనే, మరోవైపు వరుసగా మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్లను జాన్వీ షేర్ చేస్తోంది.
