'పెద్ది'తో జాయిన్ అయిన తంగం!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌గా రూపొందుతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 4 Jun 2025 2:16 PMరామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌గా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల తేదీని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్‌కి ముందే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు బుచ్చిబాబు నుంచి ప్రకటన వచ్చింది. అధికారికంగా పోస్టర్‌ను సైతం విడుదల చేయడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబుకు ఉన్న కమిట్‌మెంట్ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం కానివ్వకుండా అనుకున్న తేదీకి కచ్చితంగా పెద్ది సినిమాను తీసుకు వస్తాడు అనే విశ్వాసం ను ఆయన్ను నమ్మిన వారు, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.
ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టిని ఎంత అందంగా చూపించాడో మనం అంతా చూశాం, అంతే కాకుండా సినిమా కథలో ఆమె పాత్ర ప్రాముఖ్యత ఏంటో కూడా అందరికీ తెలిసిందే. ఆయన గురువు సుకుమార్ సైతం హీరోయిన్స్‌కు చాలా ప్రాముఖ్యత కల్పిస్తారు. పుష్ప లో రష్మిక రోల్ ఏంటో అందరికీ తెలిసిందే. గురువును ఫాలో అవుతూ తన ప్రతి కథలోనూ హీరోయిన్స్‌కు బుచ్చిబాబు పెద్ద పీట వేసే విధంగా రాసుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజం అయితే పెద్ది సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతున్న జాన్వీ కపూర్‌కి లీడ్ రోల్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య పెద్ది లో జాన్వీ కపూర్ ఎలా ఉంటుంది అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్‌ను పూర్తి చేసినప్పటికీ హీరోయిన్ జాన్వీ కపూర్ రెండు మూడు రోజులు తప్ప ఎక్కువగా షూటింగ్‌లో పాలుపంచుకోలేదు. ఎట్టకేలకు రామ్ చరణ్‌తో కలిసి జాన్వీ కపూర్ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తుంది. అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చరణ్, జాన్వీ కాంబోలో సన్నివేశాలు షూట్ చేస్తున్నారని, త్వరలోనే సినిమా నుంచి రొమాంటిక్ నెంబర్ షూటింగ్ అప్‌డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల జోడీని వెండి తెరపై చూడాలని కోరుకుంటున్న అభిమానులకు పెద్ది సినిమాతో ఆ డ్రీమ్ నెరవేరబోతుంది. జాన్వీ కపూర్ మరోసారి అందాలతో కిల్ చేస్తుందేమో చూడాలి.
పెద్ది సినిమాలో రామ్ చరణ్ లుక్ విషయంలో క్లారిటీ ఉంది. పల్లెటూరి ఆటగాడిగా కనిపించబోతున్నాడు. మరి జాన్వీ కపూర్ కూడా క్రీడాకారిణిగా ఏమైనా కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది. దేవర సినిమాలో ఎలా అయితే పల్లెటూరి అమ్మాయి తంగం గా కనిపించిందో అలాగే పెద్ది సినిమాలో కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. లంగా ఓనీ పాత్రలు ఈ అమ్మడికి బాగానే సెట్ అవుతాయనే నమ్మకం ఉంది. బుచ్చిబాబు జాన్వీ కపూర్‌ను ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల కాంబో సన్నివేశాల చిత్రీకరణ పట్ల మేకర్స్ సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉంది.