Begin typing your search above and press return to search.

స్టార్ డాట‌ర్ పారితోషికం అంత ఉందా?

ఇటీవ‌లి కాలంలో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ డెబ్యూ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 6:00 AM GMT
స్టార్ డాట‌ర్ పారితోషికం అంత ఉందా?
X

ఇటీవ‌లి కాలంలో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ డెబ్యూ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు తెలుగుతెర‌కు ప‌రిచ‌యం కావ‌డం ఎగ్జ‌యిట్ చేస్తోందంటూ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో జాన్వీ క‌పూర్ పారితోషికం గురించి ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దేవ‌ర‌లో న‌టించిందుకు జాన్వీ కపూర్ భారీ మొత్తంలో రూ. పారితోషికం అందుకుంటోంద‌ని, సుమారు 10 కోట్లు డిమాండ్ చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఇది అసంబ‌ద్ద‌మైన ప్ర‌చారం. జాన్వీ సుమారు 6 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్న‌ట్టు తెలిసింది. అంతేకాదు దేవ‌ర వ‌ర్గాల నుంచి అందిన సోర్స్ ప్ర‌కారం.. జాన్వీ త‌న‌ కెరీర్‌లో భారీ ఫీజు ఇదేన‌ని కూడా తెలిసింది. దేవ‌ర పాన్ ఇండియ‌న్ సినిమా. తెలుగు-త‌మిళంతో పాటు హిందీలోను అత్యంత భారీగా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ దేవ‌ర‌తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇందులో సైఫ్ విల‌న్ గా న‌టిస్తున్నార‌ని టాక్ ఉంది. అనిరుధ్ రవించందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లి స‌క్సెస్ రేటు, బిజీ షెడ్యూళ్ల కార‌ణంగా అనిరుధ్ కి కూడా భారీ పారితోషికం ముట్ట‌జెబుతున్నార‌న్న చ‌ర్చా సాగుతోంది.

ఇక జాన్వీ క‌పూర్ కోసం 6 కోట్ల పారితోషికం అంద‌జేయ‌డం కూడా ఇది నిర్మాత‌ల‌కు త‌ల‌కుమించిన భారం అన‌డంలో సందేహం లేదు. గ‌తంలో సాహో కోసం శ్ర‌ద్ధా క‌పూర్ 6-8 కోట్ల మేర అందుకుంది. ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ .కెలో న‌టిస్తున్న దీపిక ప‌దుకొనేకు 15 కోట్లు, అద‌నంగా సౌక‌ర్యాలు క‌లుపుకుని 18కోట్ల వ‌ర‌కూ ముట్ట‌జెబుతున్నార‌న్న చ‌ర్చ ఉంది. అయితే దీపిక ప‌దుకొనే ట్రాక్ రికార్డ్, ఇమేజ్ దృష్ట్యా ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేయ‌డం రొటీన్ అనుకున్నా కానీ, జాన్వీ లాంటి డెబ్యూ క‌థానాయిక 10కోట్లు డిమాండ్ చేయ‌డం అసంబ‌ద్ధ‌మైన చ‌ర్య‌గా విశ్లేషిస్తున్నారు.