ఆమె వాడిన బ్యాగ్‌కి వేలంలో రూ.85 కోట్లు...!
సెలబ్రిటీలు వాడిన వస్తువులకు మంచి క్రేజ్ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు ఫాలో అయ్యే ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ ఉంటారు.
By: Tupaki Desk | 11 July 2025 3:00 PM ISTసెలబ్రిటీలు వాడిన వస్తువులకు మంచి క్రేజ్ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు ఫాలో అయ్యే ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ ఉంటారు. వారు ధరించినట్లుగా విభిన్నమైన డ్రెస్‌లను ధరించడంతో పాటు, వారు ధరించిన చెప్పులు, వారు వాడుతున్నటువంటి బ్యాగ్‌లను వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తమ బ్రాండ్‌ను చూపించుకోవడానికి, తమ బడాయి చాటుకోవడానికి చాలా మంది సెలబ్రిటీలు ఉపయోగించే వస్తువులను లేదా ఆ తరహాలో ఉన్న వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు వాడిన వాటినే కావాలని కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్నింటిని లక్షలు పోసి మరీ కొనుగోలు చేసిన వారు ఉన్నారు.
ప్రముఖులు వాడిన వస్తువులకు బాగా డిమాండ్ ఉంటుంది. గొప్ప వారు, చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులను అప్పుడప్పుడు వేలం వేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. దేనికి పనికి రాని వస్తువులు కూడా లక్షలు, కోట్ల రూపాయల రేటు పలకడం మనం చూస్తూనే ఉంటాం. చెప్పులు, వారు రాసిన ఉత్తరాలు, వారు ఉపయోగించిన బ్యాగ్స్, వారు ఉపయోగించిన మరే ఇతర వస్తువులను వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును చారిటీ కోసం ఇవ్వడం జరుగుతుంది. కొందరు మాత్రం సొంత అవసరాల కోసం కూడా వింటేజ్ వస్తువులను వేలం వేయడం జరుగుతుంది. తాజాగా ఒక నటి వాడిన హ్యాండ్ బ్యాగ్‌ను వేలం వేయగా ఏకంగా రూ.85 కోట్ల రేట్లు పలికింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్‌కు చెందిన నటి జానే బర్కిన్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన హర్మీస్ కంపెనీ వారు అరుదైన బ్యాగ్‌ను తయారు చేశారు. ఆ బ్యాగ్‌ను జానే బర్కిన్ చాలా కాలం వినియోగించింది. కొన్నాళ్ల తర్వాత ఆ బ్యాగ్‌ను జానే బర్కిన్ తిరిగి హర్మీస్ వారికి అప్పగించింది. అప్పటి నుంచి ఆ బ్యాగ్‌ను ఛారిటీ కోసం వేలం వేయడం జరుగుతోంది. మొదటి సారి ఆ బ్యాగ్‌ను వేలం వేసిన సమయంలో వచ్చిన డబ్బును ఎయిడ్స్ నిర్మూలనకు పని చేసే ఛారిటీ కోసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆ బ్యాగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పలు ఛారిటీ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బ్యాగ్‌ను ఏకంగా రూ.85 కోట్లకు జపాన్ వ్యక్తి కొనుగోలు చేశాడు.
ఈ బ్యాగ్‌కి చాలా చరిత్ర ఉంది. 1980లో బర్కిన్ విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమె పక్క సీటులో హర్మీస్ కంపెనీ యజమాని కూర్చున్నాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మాటలు కలవడం, అప్పుడు ఆడవారు ఒక బిడ్డకు సరిపోయే విధంగా వస్తువులు తీసుకుని వెళ్ళడానికి వీలుగా బ్యాగ్స్ లభించడం లేదని చెప్పిందట. దాంతో ఆ కంపెనీ యజమాని దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత బర్కిన్‌కు ఈ బ్యాగ్‌ను అందజేశాడు. బ్యాగ్‌ను ప్రత్యేకమైన మెటీరియల్‌తో తయారు చేయడం జరిగిందట. అంతే కాకుండా భుజాలకు వేసుకున్న సమయంలో జారి పోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా బ్యాగ్‌ను చాలా ప్రత్యేక శ్రద్దతో తయారు చేశారు. కంపెనీ మొదటి ప్రాడెక్ట్ కావడంతో పాటు ప్రముఖ నటి వాడింది కనుకే ఈ స్థాయిలో వేలంలో అమ్ముడు పోయింది. ముందు ముందు ఇంకా పాత వస్తువులకు డిమాండ్ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
