Begin typing your search above and press return to search.

ఆ మూవీ సెన్సార్ వివాదానికి లైన్ క్లియ‌ర్

సెన్సార్ బోర్డు చెప్పిన విష‌యం విని అస‌హ‌నం వ్య‌క్తం చేసిన చిత్ర యూనిట్ దాన్ని వ్య‌తిరేకిస్తూ కేర‌ళ హైకోర్టుకు వెళ్లారు.

By:  Tupaki Desk   |   9 July 2025 8:57 PM IST
ఆ మూవీ సెన్సార్ వివాదానికి లైన్ క్లియ‌ర్
X

కేంద్ర మంత్రి, మ‌ల‌యాళ ప్ర‌ముఖ న‌టులు సురేష్ గోపీ, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన సినిమా జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ‌. ఈ సినిమా లో అత్యాచారానికి, లైంగిక వేధింపుల‌కు గురైన జాన‌కి పాత్ర‌లో అనుప‌మ న‌టించారు. సీతాదేవికి మ‌రొక పేరైన జాన‌కిని ప్ర‌ధాన పాత్ర‌ధారికి పెట్ట‌డం, ఆ పాత్ర లైంగిక వేధింపులకు గుర‌వ‌డం హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ 96 క‌ట్స్ చేయాల‌ని సూచించిన‌ సంగతి తెలిసిందే.

సెన్సార్ బోర్డు చెప్పిన విష‌యం విని అస‌హ‌నం వ్య‌క్తం చేసిన చిత్ర యూనిట్ దాన్ని వ్య‌తిరేకిస్తూ కేర‌ళ హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఇప్పుడు సెన్సార్ బోర్డు ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గింది. ఈ సినిమాకు ముందుగా చెప్పిన 96 క‌ట్స్ వ‌ద్ద‌ని కేవ‌లం రెండు మార్పులు చేయాల‌ని సూచించింది. ఈ మేర‌కు సెన్సార్ బోర్డు త‌ర‌పున లాయ‌ర్ కోర్టులో త‌న వాద‌న‌ను వినిపించారు.

మూవీ టైటిల్ విష‌యంలో చిన్న మార్పు చేసి జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ‌కు బ‌దులు సినిమాలోని హీరోయిన్ పేరుకు అనుగుణంగా వి జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ లేదా జాన‌కి వి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ గా మార్చ‌మ‌ని కోరారు. దాంతో పాటూ మూవీలోని ఓ కోర్టు సీన్ లో హీరోయిన్ పేరును మ్యూట్ చేయ‌మ‌ని కూడా కోరారు. అలా చేయ‌క‌పోతే ఫ్యూచ‌ర్ లో ఇదే త‌ర‌హా స‌న్నివేశాలు వ‌చ్చే ఛాన్సుంద‌ని, అది కొన్ని మ‌తాల వారి సెంటిమెంట్స్ కు ఇబ్బంది క‌లిగిస్తుంద‌ని తెలిపారు.

సెన్సారు బోర్డు వాద‌న‌ల‌ను విన్న కోర్టు దీనిపై ద‌ర్శ‌క‌నిర్మాత‌ల అభిప్రాయాలు తెలియచేయానల‌ని ఆదేశించింది. అయితే సెన్సార్ బోర్డ్ ముందు ఇచ్చిన 96 కట్స్ తో పోలిస్తే ఈ రెండు మార్పులు పెద్ద‌గా ఇబ్బంది పెట్టేవి కావ‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఈ విష‌యంపై చిత్ర యూనిట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కావాల్సింది కానీ సెన్సార్ ఇష్యూ వ‌ల్ల సినిమా పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు విష‌యం స‌ద్దుమ‌ణుగుతున్న‌ట్టు అనిపిస్తుంది కాబ‌ట్టి త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవ‌కాశ‌ముంది.