Begin typing your search above and press return to search.

'జ‌న నాయ‌గ‌న్‌'..ఫుట్ బాల్ ఆట‌ ఎప్ప‌టికి ఆగేనో!

ఎవ‌రైనా స్టార్ సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నాడంటే ఫ్యాన్స్‌కు కాదు అది స‌గ‌టు సినీ ల‌వ‌ర్‌కు కూడా బ్యాడ్ న్యూసే. దాన్ని ఎవ‌రూ అంగీక‌రించ‌రు.

By:  Tupaki Entertainment Desk   |   9 Feb 2026 7:00 PM IST
జ‌న నాయ‌గ‌న్‌..ఫుట్ బాల్ ఆట‌ ఎప్ప‌టికి ఆగేనో!
X

ఎవ‌రైనా స్టార్ సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నాడంటే ఫ్యాన్స్‌కు కాదు అది స‌గ‌టు సినీ ల‌వ‌ర్‌కు కూడా బ్యాడ్ న్యూసే. దాన్ని ఎవ‌రూ అంగీక‌రించ‌రు. వెండితెర‌పై ద‌శాబ్దాల కాలం పాటు మెరుపులు మెరిపించి కోట్లాది మంది ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా త‌న‌దైన ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్న‌కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ విష‌యంలోనూ ఆయ‌న ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ ఇదే ఫీల‌వుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి మూవీ `జ‌న నాయ‌గ‌న్‌`. ఈ మూవీతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నాడు.

క్రియాశీల రాజ‌కీయాల్లో ఇక నుంచి పూర్తి స్థాయిలో యాక్టీవ్ కావాల‌ని విజ‌య్ నిశ్చ‌యించుకుని సినిమాల నుంచి త‌ప్పుకుంటున్నాడు. అయితే అత‌ని చివ‌రి మూవీ చుట్టూ జ‌రుగుతున్న తంతు ఓ ఫుట్ బాల్ ఆట‌ని గుర్తు చేస్తూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `జ‌న నాగ‌య‌న్` జ‌న‌వ‌రి 9న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాల‌ని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో సెన్సార్ బోర్డ్ క్లియ‌రెన్స్ రాక‌పోవ‌డంతో రిలీజ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన సింగిల్ బెంచ్ ఉత్త‌ర్వుల్ని స‌వాల్ చేయ‌డంతో ఈ మూవీ రిలీజ్ ఆగిపోయింది.

ఆ త‌రువాత కూడా సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేక‌పోవ‌డంతో `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రీసెంట్‌గా సినిమా ఫైన‌ల్ క‌ట్ రెడీ అవుతోంద‌ని, సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు కోరిన క‌ట్స్‌కు టీమ్ సిద్ద‌ప‌డింద‌ని, ఫైన‌ల్ క‌ట్‌ని సీబీఎఫ్‌సీకి మ‌రోసారి పంపించ‌బోతోంద‌ని వార్త‌లు షికారు చేయ‌డంతో ఫిబ్ర‌వ‌రిలో `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ అవుతుంద‌ని అంతా భావించారు. కానీ ఇప్పుడు డామిట్ క‌థ మ‌ళ్లీ అడ్డం తిరిగిన‌ట్టుగా తెలుస్తోంది. మూవీ సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీపై సీబీఎఫ్‌సీ సైలెంట్ అయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

చెప్పిన క‌ట్స్‌కు అంగీక‌రించినా వారి నుంచి ఎలాంటి స్పంద‌న ల‌భించే అవ‌కాశం లేద‌ని గ్ర‌హించిన మేక‌ర్స్ ఫైన‌ల్‌గా రివిజ‌న్ క‌మిటీ ముందుకు వెళ్ల‌డానికి రెడీ అయిన‌ట్టుగా కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇప్ప‌టికే అనుకున్న మార్పులు పూర్తి చేసిన టీమ్ ఈ మూవీని రిలీజ‌న్ క‌మిటీ ముందుకు తీసుకెళ్లార‌ని, ఇప్పుడు బాల్ వారి కోర్టులో ఉంద‌ని ఇన్ సైడ్ న్యూస్‌. `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఫుట్ బాల్ ఆట‌లా ఉంద‌ని, కోర్టుకు వెళితే అక్క‌డి నుంచి సెన్సార్ వారి వ‌ద్ద‌కు వెళుతోంద‌ని, అక్క‌డ కూడా కుద‌ర‌క‌పోవ‌డంతో రివిజ‌న్ క‌మిటీ ముందుకు వెళ్లింద‌ని, ఈ సినిమాతో అంతా ఓ ఫుట్ బాల్ ఆట ఆడుకుంటున్నార‌ని త‌మిళ ప్రేక్ష‌కులు, విజ‌య్ అభిమానులు వాపోతున్నారు.

ఇప్పటికైనా `జ‌న నాయ‌గ‌న్‌` సెన్సార్ అడ్డుగోడ‌ల్ని బ‌ద్దులు కొట్టుకుని థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రో రెండు మూడు నెల‌ల్లో అంటే ఏప్రిల్‌, మే నెల‌ల్లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ సినిమా రిలీజ్ అయితే విజ‌య్‌కి వ‌చ్చే మైలేజ్ వేరుగా ఉంటుంద‌ని, ఆ కార‌ణంగానే ఈ సినిమాని తొక్కి పెడుతున్నార‌ని త‌మిళ‌నాట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.