Begin typing your search above and press return to search.

సెన్సార్ వివాదం విజ‌య్‌కి లాభ‌మే చేసిందా?

దీంతో సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేంజ్ సినిమాకు ప‌బ్లిసిటీ చేయాలంటే మేక‌ర్స్ కోట్లు ఖ‌ర్చు చేయాలి.

By:  Tupaki Entertainment Desk   |   12 Feb 2026 11:00 PM IST
సెన్సార్ వివాదం విజ‌య్‌కి లాభ‌మే చేసిందా?
X

ఈ మ‌ధ్య కోట్లు పెట్టినా రాని ప‌బ్లిసిటీ ఒక్క వివాదంతో వ‌చ్చేస్తోంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ మీడియాలోనూ, సినిమాల్లోనూ వైర‌ల్ టాపిక్‌నే ఎంచుకుంటున్నారు.. వైరల్ అవుతున్నారు. త‌ద్వారా ఫ్రీగానే ప‌బ్లిసిటీని సొంతం చేసుకుంటూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫేమ‌స్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే ట్రెండ్ న‌డుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` విష‌యంలోనూ ఇదే ఫార్ములా ఆ సినిమాకు ప్ల‌స్ అయింది అని చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌న‌వ‌రి 9న పొంగ‌ల్ బ‌రిలో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా అర్థాంత‌రంగా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే.

సెన్సార్ వివాదం కార‌ణంగా చివ‌రి నిమిషంలో సినిమా రిలీజ్ ఆగిపోయింది. సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు సినిమాలోని వివిధ స‌న్నివేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం, కొన్ని డైలాగ్స్‌ని మ్యూట్ చేయాల‌ని మేక‌ర్స్‌కి సూచించ‌డంతో వాటికి అంగీక‌రించ‌ని మేక‌ర్స్ మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. ఇక్క‌డి నుంచే అస‌లు వివాదం మొద‌లై సినిమా థియేట‌ర్ల‌లోకి రావ‌డం ఇక క‌ష్ట‌మ‌నే ఊహ‌గాలు వైర‌ల్ అయ్యేలా చేసింది. దీంతో సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేంజ్ సినిమాకు ప‌బ్లిసిటీ చేయాలంటే మేక‌ర్స్ కోట్లు ఖ‌ర్చు చేయాలి.

కానీ సెన్సార్ వివాదం కార‌ణంగా ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా ఊహించ‌ని స్థాయి ఫ్రీ ప‌బ్లిసిటీ ల‌భించింది. పొంగ‌ల్ రిలీజ్ అయితే వారం రోజులు మాత్ర‌మే హ‌డావిడి ఉండేది. రిలీజ్ వాయిదా ప‌డ‌టం వ‌ల్ల జ‌న నాయ‌గ‌న్ టీమ్‌కు మంచే జ‌రిగింద‌ని, సంక్రాంతి సినిమాల మ‌ధ్య రిలీజ్ అయితే ఆ స్థాయి బ‌జ్ ఉండేది కాద‌ని, రిలీజ్ పోస్ట్ పోన్ కావ‌డ‌మే మంచిది అయింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అంతే కాకుండా ఇప్ప‌ట‌కే బుక్ మై షోలో 1.1 మిలియ‌న్‌ల వ‌రకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపించారు.

4,50,000 టికెట్‌లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. సినిమా రిలీజ్ వాయిదాప‌డ‌టంతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న అంద‌రికి భారీ మొత్తంలో డ‌బ్బుని తిరిగి చెల్లించ‌డం ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైమ్ కావ‌డంతో `జ‌న నాయ‌గ‌న్‌` మ‌రోసారి దేశ వ్యాప్తంగా వైర‌ల్‌గా మారింది. ఈ నేప‌థ్యంలోనే ట్రేడ్ వ‌ర్గాలు ఓ ఆస‌క్తిక‌ర‌మైన లెక్క‌ల‌ని వేస్తున్నారు. రిలీజ్‌కు ముందే సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ రిలీజ్ త‌రువాత రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే గ‌త నెల రోజులుగా రిలీజ్ విష‌యంలో సందిగ్ద‌త నెల‌కొన్న ఈ మూవీ టీమ్ తాజాగా ఓ ముంద‌డుగు వేసింది. సీబీఎఫ్‌సీపై వేసిన కేసుని విత్‌డ్రా చేసుకున్నారు. దీన్ని మ‌ద్రాస్ హైకోర్టు ఆమోదించ‌డంతో సినిమా రిలీజ్‌కు మార్గం సుగ‌మం అయింది. ఇప్ప‌టికే సెన్సార్ స‌భ్యులు సూచించిన మార్పులు చేసి టీమ్ రివైజింగ్ క‌మిటీకి పంపించారు. వారి నుంచి వ‌చ్చే స‌మాధానం కోసం టీమ్ ఇప్పుడు ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అంతా అనుకున్న‌ట్టుగా జ‌రిగితే సినిమా త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రావ‌డం ఖాయం.