దళపతి 'జన నాయగన్' కోసం ఆ ముగ్గురు!
ఇక్కడే డామిట్ కథ అడ్డంతిరిగింది. సీబీఎష్‌సీ వర్గాలు మద్రాస్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేయడంతో మళ్లీ కథ మొదటికొచ్చి `జన నాయగన్` రిలీజ్ ఆగిపోయింది.
By: Ravindar Gorantla | 7 March 2026 6:00 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి కథనాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జన నాయగన్`. ఈ మూవీని ఏ క్షణాన మొదలు పెట్టారో కానీ అడుగడుగున ఇబ్బందులే తలెత్తుతున్నాయి. ఇంత వరుకు ఏ స్టార్ హీరో సినిమాకు రాని ఇబ్బందులు ఈ మూవీకి ఎదురవుతున్న విషయం తెలిసిందే. విజయ్ నటించిన చివరి సినిమా సాఫీగా రిలీజ్ అవుతుందని అభిమానులు, ఇన్నేళ్లు స్టార్ హీరోగా అభిమానుల్ని అలరించిన కథానాయకుడిగా గ్రాండ్‌గా ఫేర్‌వెన్ ఇవ్వాలని మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్ కోసం ప్లాన్ చేసుకోవడం తెలిసిందే.
జనవరి 9న పొంగల్ బరిలో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ బృందం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సర్తిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో సినిమా రిలీజ్ వాయిదాపడి అంతరిని షాక్‌కు గురి చేసింది. మేకర్స్ షాక్ నుంచి తేరుకుని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం, కోర్టు సెన్సార్ వారిని మందలించి సర్టిఫికెట్ జారీ చేయాల్సిందేనని తీర్పు చెప్పడంతో అభిమానులు, మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమా రిలీజ్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని సంబరాలు చేసుకున్నారు.
ఇక్కడే డామిట్ కథ అడ్డంతిరిగింది. సీబీఎష్‌సీ వర్గాలు మద్రాస్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేయడంతో మళ్లీ కథ మొదటికొచ్చి `జన నాయగన్` రిలీజ్ ఆగిపోయింది. ఫైనల్‌గా సినిమా చుట్టూ జరుగుతున్న వివాదాన్ని అర్థం చేసుకున్న మేకర్స్ సెన్సార్ వారికి వ్యతిరేకంగా వేసిన పిటీషన్‌ని రిటర్న్ తీసుకుని వారు అడిగిన కట్స్‌కు అంగీకారం తెలుపుతూ ఫైనల్ కట్‌ని రివైజింగ్ కమిటీకి పంపించి గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా రివైజింగ్ కమిటీ నుంచి మేకర్స్‌కి మెయిల్ వచ్చేసింది.
మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు సినిమాని రివ్యూ చేస్తామని ప్రకటించారు. దీంతో కేవీఎన్ ప్రొడక్షన్ వర్గాల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. రివైజింగ్ కమిటీ సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వబోతోంది. మార్చి 9న కానీ, లేదా రెండు మూడు రోజుల్లో సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తే సినిమాని ఇదే నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దళపతి కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. విజయ్‌తో భారీ సినిమాలని అందించిన లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీలోని ఓ కీలక ఘట్టంలో అతిథి పాత్రల్లో కనిపింనున్నారని తెలిసింది.
విజయ్ చివరి సినిమా కావడంతో ఈ ముగ్గురు డైరెక్టర్లు ఇందులో అతిథి క్యారెక్టర్లలో కనిపిస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇంత వరకు ఆ విషయాన్ని అధికారికంగా అంగీకరించని మేకర్స్ ఫైనల్‌గా ఈ మూవీ డిటైల్స్‌లలో ఇది `భగవంత్ కేసరి` రీమేక్ అని ప్రకటించడం గమనార్హం.
