అందంగా లేవు చనిపోమన్నారు.. నటి ఆవేదన
ఇప్పుడు జానీ లివర్ కుమార్తె జేమీ లివర్ తాను ప్రజల నుంచి ఎదుర్కొన్న సమస్యలను ఏకరువు పెట్టారు.
By: Tupaki Desk | 10 Jun 2025 9:21 AM ISTచాలా మంది కథానాయికలు అధిక బరువు కారణంగా సమాజంలో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వర్ణ వివక్ష.. అహంకారంతో కూడుకున్న విమర్శలను కూడా ఎదుర్కొన్నామని కొందరు గతంలో తెలిపారు. సారా అలీఖాన్, సోనాక్షి సిన్హా, ఖుషీ కపూర్, సుహానా ఖాన్ లాంటి కథానాయికలకే తప్పలేదు విమర్శలు.
కానీ వారితో పోలిస్తే కాస్త డార్క్ షేడ్ తో అధిక బరువు సమస్యతో కనిపించే వారికి ఎలాంటి పాట్లు ఉంటాయో ఊహించగలం. ఇప్పుడు జానీ లివర్ కుమార్తె జేమీ లివర్ తాను ప్రజల నుంచి ఎదుర్కొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఎదిగే వయసులో తాను చాలా అవమానాల్ని భరించానని తెలిపారు. తన రంగు మరీ నల్లగా ఉందని, అధిక బరువుతో వికారంగా ఉన్నావని విమర్శించారు. తన బరువును కవర్ చేయడానికి లూజ్ గా ఉండే దుస్తులను ధరించానని జామీ తెలిపారు. తన తల్లిదండ్రులు కూడా లూజు దుస్తులు ధరించారని తనకు సూచించారు.
తనను తాను అసహ్యించుకునేది. అంతేకాదు తన చర్మం రంగు గురించి బాధాకరమైన వ్యాఖ్యలను కూడా భరించాల్సి వచ్చింది. తాను నల్లగా ఉన్నానని, వికారంగా ఉన్నానని, నవ్వితే మాంత్రికురాలి లాగా ఉంటానని కామెంట్లు చేసిన వారున్నారు. ఈ లుక్స్ కారణంగా తనకు పని దొరకదని చెరబుతారని జేమీ వెల్లడించింది. కొందరు మరీ ఘోరంగా, తనను చనిపోవాని కూడా కోరారట. తెల్లగా అందంగా ఉంటేనే అవకాశాలు అని కూడా సూచించారు. మొత్తానికి జానీ లివర్ నటవారసురాలు జామీ లివర్ చాలా కలతకు గురయ్యారు. కానీ మారిన ఈ అధునాతన సమాజంలో డిజిటల్ యుగంలో ఇప్పటికీ ఇలాంటి అంతఃసౌందర్యం లేని వెకిలి మనుషులను చూడాల్సి వస్తోంది. నలుపు తెలుపు అంటూ జాత్యాహంకారం ప్రదర్శించడం ఘోరమైన క్రతువు. కాలంతో పాటు మార్పు రావాల్సి ఉంది.