Begin typing your search above and press return to search.

అంచ‌నాల‌కు మించి లైవ్ యాక్ష‌న్ తో 'అవ‌తార్-3'

విజువ‌ల్ వండ‌ర్ 'అవతార్' గురించి చెప్ప‌డం మాటల్లో సాధ్యంకానిది. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో అవ‌తార్ ఓ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   14 Dec 2023 10:30 AM GMT
అంచ‌నాల‌కు మించి లైవ్ యాక్ష‌న్ తో అవ‌తార్-3
X

విజువ‌ల్ వండ‌ర్ 'అవతార్' గురించి చెప్ప‌డం మాటల్లో సాధ్యంకానిది. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో అవ‌తార్ ఓ సంచ‌ల‌నం. కామోరూన్ సృష్టించిన ఓ గొప్ప అద్భుతమ‌ది. మొద‌టి భాగాన్ని పండోరా గ్ర‌హంపై సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. అటుపై 'అవ‌తార్ -ది వే ఆఫ్ వాట‌ర్' తో స‌ముద్ర గ‌ర్భంలోకి తీసుకెళ్లారు. 'అవతార్-2' అన్న‌ది కేవ‌లం స‌ముద్ర గ‌ర్భంలో ఓ చిన్న భాగం మాత్ర‌మే.

సిస‌లైన ట్రీట్ మూడ‌వ భాగంలో ఉండ‌బోతుంది. రెండ‌వ భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 160 భాష‌ల్లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఇక ఇదే ప్రాంచైజీ నుంచి రానున్న మూడ‌వ భాగాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు గ‌తంలోనే ప్ర‌క‌టించారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు కామోరూన్ మీడియాతో పంచుకున్నారు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే... 'ఈసారి పాత్ర‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాను.

మంచి క‌థ‌..క‌థ‌నాల‌తో భారీ విజువ‌ల్స్ తో అల‌రిస్తాం. 2025 డిసెంబ‌ర్ 19 మూడ‌వ భాగాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. మిమ్మ‌ల్ని అంద‌ర్నీ క‌నువిందు చేసేలా టీజ‌ర్ రెడీ అవుతుంది. అతి త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తాం. మీ అంచ‌నాలకు మించి లైవ్ యాక్ష‌న్ ఇందులో చూస్తారు. క‌థ‌కి స్పాన్ ఉండ‌టంతో చాలా కొత్త పాత్ర‌లు క‌నిపిస్తాయి. అవి అంతే వైవిథ్యంతో కూడి ఉంటాయి. ఏ పాత్ర ప్ర‌త్యేక‌త దానికి ఉంటుంది.

స‌ముద్రం అడుగు భాగం ఎంత అందంగా..అద్భుతంగా ఉంటుందో చూడ‌బోతున్నారు. ది వే ఆఫ్ వాట‌ర్ లో క‌నిపించ‌ని కేట్ విన్స్ లెట్ చూసిన రోనాల్ పాత్ర‌ను అవాత‌ర్ 3 లో మ‌రింత పొడిగించాం. మీరు ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని మ‌రో కొత్త ప్ర‌పంచంగా భావిస్తారు' అని అన్నారు. మొత్తానికి కామోరూన్ వ్యాఖ్య‌లు అవ‌తార్ అభిమానుల్లో మ‌రోసారి ఉత్సాహాన్ని నింపాయి. అవ‌తార్ కి అభిమాని కానిది ఎవ‌రు? ప్ర‌పంచ వ్యాప్తంగా కామోరూన్ విజువ‌ల్ వండర్స్ ఆస్వాదించ‌డానికి ప్రేక్ష‌కులంతా సిద్ద‌మే. ఇక అవ‌తార్ నుంచి రానున్న నాల్గ‌వ భాగం 2029లో..చివ‌రి భాగం 2031 లోను రిలీజ్ అవుతాయి.