అణుబాంబు దాడి కథతో జేమ్స్ కామెరూన్ సినిమా!
సరిగ్గా ఇదే సమయంలో అణుబాంబు కథతో సినిమా తీస్తానంటూ సంచలన ప్రకటన చేసారు ప్రపంచ దిగ్దదర్శకుడు జేమ్స్ కామోరూన్.
By: Tupaki Desk | 5 May 2025 2:00 PM ISTఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది చెప్పాల్సిన పనిలేదు. ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతుందనే టెన్షన్ అందరిలోనూ ఉంది. మరోవైపు పాకిస్తాన్ అణుబాంబులు వేస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. చింత చచ్చినా పులు చావలేదు? అన్న తీరున వ్యవహరిస్తుంది.
సరిగ్గా ఇదే సమయంలో అణుబాంబు కథతో సినిమా తీస్తానంటూ సంచలన ప్రకటన చేసారు ప్రపంచ దిగ్దదర్శకుడు జేమ్స్ కామోరూన్. చార్లెస్ పెలెగ్రినో రచించిన' ఘోస్ట్ ఆఫ్ హిరోషిమా' అనే పుస్తకం ఆధారంగా ఈసినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్దంలో అణుదాడి నుంచి బయటపడిన జపాన్ కు చెందిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. దీని తర్వాత 'అవతార్ 4' రానుంది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత అణుబాంబు పై సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే అందుకు చాలా సమయం పడుతుంది. సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది. జేమ్స్ కామెరూన్ సినిమాలంటే ఇలా చుట్టేసి అలా రిలీజ్ చేసేవి కాదు.
ఒక్కో ప్రాజెక్ట్ పై నాలుగైదేళ్లు పని చేస్తుంటారు. టెక్నికల్ బ్యాక్ డ్రాప్ కథ అయితే సమయం ఇంకా ఎక్కు వగా పడుతుంది. అణుబాంబు స్టోరీ తో పాటు ఓ వ్యక్తి కథను కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నం కాబట్టి సమయం పడుతుంది. హిరోషిమా, నాగాసాకీలపై అణుదాడి తర్వాత అక్కడ గడ్డిపోచ కూడా మొలవని సంగతి తెలిసిందే.
