Begin typing your search above and press return to search.

యానిమల్.. డిమాండ్ దెబ్బకు జమాల్ వచ్చేసింది

అయితే మరికొన్ని యూట్యూబ్ ట్యూన్స్ కూడా తీసుకువచ్చి యానిమల్ సినిమాలో సరికొత్తగా హెలేట్ చేశారు అందులో అరబ్ సాంగ్ అయినటువంటి జమాల్ కుడు బాగా వైరల్ అయింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 11:49 AM GMT
యానిమల్.. డిమాండ్ దెబ్బకు జమాల్ వచ్చేసింది
X

యానిమల్ సినిమాలో కూడా సందీప్ రెడ్డివంగా ఈసారి కొన్ని సన్నివేశాలను కాంట్రవర్సీకి దగ్గరగానే టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా కొన్ని సీన్స్ పై గట్టిగానే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అసలు సినిమాపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ సినిమాలో సందీప్ రెడ్డి మ్యూజిక్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక సాంగ్స్ కంటే కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే మరికొన్ని యూట్యూబ్ ట్యూన్స్ కూడా తీసుకువచ్చి యానిమల్ సినిమాలో సరికొత్తగా హెలేట్ చేశారు అందులో అరబ్ సాంగ్ అయినటువంటి జమాల్ కుడు బాగా వైరల్ అయింది.

పవర్ఫుల్ విలన్ గా బాబి డీయోల్ ఎంట్రీ ఉన్నప్పుడు ఈ సాంగ్ వస్తుంది. బాబి మందు గ్లాసుతో ఆడుతూనే విలన్ క్యారెక్టర్ ను బాగా హైలైట్ చేశాడు. అయితే ఈ సాంగ్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక సినిమాలో ఉన్న ఒరిజినల్ ఆర్8ఒరిజినల్ పాటను విడుదల చేయాలి అని డిమాండ్ కూడా ఎక్కువ అయింది.

దీంతో యానిమల్ యూనిట్ అఫీషియల్ గా ఆ పాటను విడుదల చేసింది. ఆడియన్స్ కోరిక మేరకు డిమాండ్కు తగ్గట్టుగా ఈ పాటను విడుదల చేయక తప్పడం లేదు అని సోషల్ మీడియాలో వివరణ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ పాటకు మరింత హైప్ క్రియేట్ అవుతుంది. సోషల్ మీడియాలో వివిధ రకాల రీల్స్ కూడా వస్తున్నాయి.

అంతేకాకుండా మీమర్స్ కూడా ఇతర ఇతర హీరోల సినిమాలలోని కొన్ని సీన్స్ కు ఈ పాటకు జత చేస్తూ మరింత హైప్ తీసుకోవస్తున్నారు. ఏది ఏమైనా యానిమల్ సినిమాకు ఈ పాట మాత్రం మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. అలాగే సినిమాలో చిన్ని చిన్ని ఆశ మ్యూజిక్ కూడా బాగా అట్రాక్ట్ చేసింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరొక లెవెల్ లో ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఆ విషయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వరన్ ను మెచ్చుకోవాల్సిందే.