Begin typing your search above and press return to search.

జైలర్.. ఇంకా కథ పూర్తవ్వలేదు..

ఇప్పుడు జైలర్ మూవీలో కూడా ఎండ్ కార్డు వేయకుండా సీక్వెల్ కి అన్నట్లుగా మెయిన్ విలన్ మాఫియా సిండికేట్ గురించి చెప్పడంతో సినిమా ముగుస్తుంది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:13 AM GMT
జైలర్.. ఇంకా కథ పూర్తవ్వలేదు..
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలకి మించి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. రోబో తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే మూవీ ఒకటి కూడా రాలేదని చెప్పాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కథ సాగుతూ ఇంటరెస్టింగ్ ఫ్యాక్టర్స్ తో కట్టిపడేసే యాక్షన్ సీక్వెన్స్ ఉండటం జైలర్ మూవీకి ప్లస్ అయ్యింది.

ఈ చిత్రం ద్వారా సూపర్ స్టార్ రజినీకాంత్ స్టామినా ఏంటనేది మరోసారి అందరికి కనిపించింది. రజినీకాంత్ తో మూవీ చేస్తే కచ్చితంగా తెలుగు, తమిళ్ రాష్ట్రాలలో మంచి హైప్ ఉంటుంది. కంటెంట్ ఏ మాత్రం బాగున్నా ప్రేక్షులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ఈ మధ్యకాలంలో ప్రతి డైరెక్టర్ సినిమా చివర్లో సీక్వెల్ కోసం అన్నట్లు స్టోరీకి ఎండ్ ఇవ్వకుండానే వదిలేస్తున్నారు. లేదంటే సీక్వెల్ కోసం ఒక లీడ్ విడిచిపెడుతున్నారు. అదే మల్టి వర్స్ తరహాలో.

ఇప్పుడు జైలర్ మూవీలో కూడా ఎండ్ కార్డు వేయకుండా సీక్వెల్ కి అన్నట్లుగా మెయిన్ విలన్ మాఫియా సిండికేట్ గురించి చెప్పడంతో సినిమా ముగుస్తుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫ్యామిలీతో ఇక హ్యాపీగా ఉండలేనని అనుకుంటాడు. ఇలా రెండు సంఘర్షణల ని సీక్వెల్ కోసం వదిలేశారు. లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో లోకేష్ యూనివర్స్ క్రియేట్ చేసుకున్నారు. ప్రతి సినిమాకి సీక్వెల్ వదిలేస్తూ ఒక మూవీ స్టోరీతో ఇంకో మూవీకి లింక్ చేస్తూ వెళ్తున్నారు.

ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న లియో మూవీ కూడా లోకేష్ యూనివర్స్ స్టోరీస్ లో భాగంగానే చేస్తున్నారు. తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోయే మూవీ కూడా సీక్వెల్ స్టోరీగానే ఉండనుంది. అయితే నెల్సన్ దిలీప్ అయితే జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి క్యామియో రోల్స్ పెట్టడంతో పాటు సినిమా ఎండింగ్ లో సీక్వెల్ లో లీడ్ ఇచ్చాడు. దీనిని బట్టి జైలర్ కి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ వయస్సు రీత్య యాక్టర్ లో మరో ఐదేళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ లోపు నెల్సన్ దిలీప్ రజినితో జైలర్ మూవీ సీక్వెల్ చేసే ఛాన్స్ ఉంటుందా అనేది చూడాలి సూపర్ స్టార్ అయితే లోకేష్ తర్వాత బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ మల్లిడితో పాటు, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మూవీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.