Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో రజనీ మ్యాజిక్.. జైలర్ బిగ్ రికార్డ్

దీంతో ఈ అంచనాల నడుమ ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 7:16 AM GMT
ఓవర్సీస్ లో రజనీ మ్యాజిక్.. జైలర్ బిగ్ రికార్డ్
X

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' ఈ ఏడాది యూఎస్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం యూఎస్ ఏ బుకింగ్‌లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్‌ల ప్రీ సేల్స్ ఇప్పటికే $800K దాటేసింది. 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది.

ఈ జైలర్ చిత్రం ప్రీమియర్స్ మరి కొన్ని గంటల్లో యూఎస్ ఏ బాక్సాఫీస్ ముందు ప్రదర్శన కానుంది. ఇప్పటికే విడుదల ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్నా గ్లామర్, రజనీకాంత్ వింటేజ్ లుక్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పటికే తమన్నా 'కావాలా సాంగ్' సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. అలాగే రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ తర్వాత రజనీకాంత్ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో ఈ సినిమాకు భారీ అంచన్నాలు ఏర్పడ్డాయి.

దీంతో ఈ అంచనాల నడుమ ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్ సహా ఇతర దేశాల్లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే యూకే, అమెరికాలో ప్రీమియర్స్ కు భారీగా స్పందన లభిస్తోంది. ప్రీమియర్‌ల ప్రీ సేల్స్ ఇప్పటికే $800K దాటేసిందని తెలిసింది. 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తోందట.

ఒకవేళ ఈ జైలర్ చిత్రం 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను అందుకుంటే.. ఈ ఏడాది యూఎస్ ఏ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న మొదటి ఇండియన్ ఫిల్మ్‌గా జైలర్ అవతరించనుంది. పేట, దర్బార్, అన్నాత్తే వంటి వరుస ఫ్లాపుల తర్వాత రజనీ నుంచి వస్తున్న చిత్రమిది. దీంతో జైలర్ విజయం రజినీకి చాలా కీలకంగా మారింది. అందుకే రజనీ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు.

ఇకపోతే ఈ జైలర్ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ కమెడియన్ సునీల్, సీనియర్ నటి రమ్యకృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ తో రూపొందించారని తెలిసింది.