Begin typing your search above and press return to search.

ఆగష్టులో ఒక 'సూపర్' హిట్ రెండు 'మెగా' డిజాస్టర్స్!

టాలీవుడ్ డిస్టిబ్యూటర్స్ కి జైలర్ ఈ నెలలో కొంత ఊరట కలిగించిందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:07 AM GMT
ఆగష్టులో ఒక సూపర్ హిట్ రెండు మెగా డిజాస్టర్స్!
X

ప్రతి నెల తెలుగులో 3 లేదా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు ఏదో ఒకటి ప్రేక్షకులని ఎంటెర్టైన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలాగే ఆగష్టులో కూడా చాలా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఈ నెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీతో రిలీజ్ సందడి స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న బయ్యర్లకి భారీ నష్టాలు అయితే తీసుకురాలేదు. అలా అని లాభాలు రాలేదు. జస్ట్ ఒకే అనిపించుకుంది. తరువాత మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చారు. ఈ మూవీ అతని కెరియర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. నిర్మాత అనిల్ సుంకరతో పాటు బయ్యర్లని ఈ చిత్రం నిలువునా ముంచేసిందని చెప్పాలి. వీకెండ్ లోనే కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయిపోయాయి.

అదే సమయంలో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో ఈ చిత్రం రన్ అవుతోంది. వంద కోట్ల గ్రాస్ దిశగా అడుగులు వేస్తోంది. టాలీవుడ్ డిస్టిబ్యూటర్స్ కి జైలర్ ఈ నెలలో కొంత ఊరట కలిగించిందని చెప్పొచ్చు. దీని తర్వాత షోహైల్ మిస్టర్ ప్రెగ్నెట్ నిర్మాత పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది.

కంటెంట్ బాగుందనే టాక్ వచ్చిన బలంగా అయితే ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది. దీంతో బిలో ఏవరేజ్ లిస్టులో చేరిపోయింది. నిర్మాత మాత్రం సేఫ్ అయ్యారు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నుంచి వచ్చిన గాండీవదారి అర్జున్ మూవీ మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడిలో మూడో వంతు కూడా కలెక్ట్ చేసేలా లేదు. వరుణ్ తేజ్ కెరియర్ లో అతి పెద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీంతో పాటు వచ్చిన దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ మూవీ కింగ్ ఆఫ్ కోతా కూడా డిజాస్టర్ చిత్రంగా నిలిచింది.

దీంతో పాటుగా రిలీజ్ అయిన కార్తికేయ బెదురులంక 2012 మూవీ కొంత వరకు ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించగలిగింది. అయితే అద్భుతంగా ఉందనే టాక్ మాత్రం లేదు. ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయే కథ కావడంతో కొంత వర్క్ అవుట్ అయ్యిందని చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఏవరేజ్ జాబితాలో ఈ మూవీ చేరనుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ నెలలో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ తో పడగా మెగా ఫ్యామిలీ నుంచి రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్స్, ఒక ఫ్లాప్ పడింది.