Begin typing your search above and press return to search.

జైలర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:21 AM GMT
జైలర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తుంది. గురువారం రిలీజైన ఈ సినిమాకు తెలుగులో అక్కడక్కడ కొద్దిగా వేరే టాక్ వచ్చినా ఓవరాల్ గా సినిమా బాగుందనే అంటున్నారు. ఇక ఈరోజు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా టాక్ అటు ఇటుగా ఉంది కాబట్టి జైలర్ సినిమాకు అది కలిసి వచ్చే అంశం అవుతుందని చెప్పొచ్చు. జైలర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ, సెంటిమెంట్ ఎమోషనల్ గా నడిపించిన నెల్సన్ సెకండ్ హాఫ్ రజనీ ఫ్యాన్స్ ని మెప్పించాడు.

అయితే కొందరు ఫస్ట్ హాఫ్ బాగుందని అంటే.. కొందరు సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు. ఏది ఏమైనా రజిని జైలర్ ఇంతకుముందు వచ్చిన మూడు నాలుగు సినిమాల కన్నా ఎక్కువ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో జైలర్ సినిమా హైలెట్ అయిన అంశాల గురించి ప్రస్తావిస్తే ముందుగా అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. స్టార్ సినిమాలకు అది కూడా అభిమాన హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ది బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తాడు.

కమల్ విక్రం సినిమా కోసం అనిరుద్ ఎలాగైతే అదరగొట్టాడో జైలర్ సినిమాకు కూడా తలైవా సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టే మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్. అనిరుద్ ని నమ్మి ప్రాజెక్ట్ చేతిలో పెడితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుంది అన్నది జైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే జైలర్ సినిమా మ్యూజిక్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు. అలా ఎందుకు అంటే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఎన్టీఆర్ లాంటి హీరోకి అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోడైతే ఆ సినిమా మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. అసలే వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న అనిరుద్ ఎన్టీఆర్ దేవర కోసం సూపర్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అనిరుద్ ఇదివరకే తెలుగు సినిమాలకు పనిచేశాడు. మ్యూజిక్ పరంగా ఓకే కానీ అనిరుద్ పనిచేసిన సినిమాలు రిజల్ట్ పరంగా తేడా కొట్టాయి. కానీ ఈసారి తెలుగులో కూడా హిట్ టార్గెట్ తో దేవరకు మ్యూజిక్ ఇస్తున్నాడు అనిరుద్. తెర మీద ఎన్టీఆర్ అభినయానికి ఎలివేషన్ ఇచ్చేలా అనిరుద్ మ్యూజిక్ దేవరకు భారీ ఎలివేషన్ అందిస్తుందని అంటున్నారు.