Begin typing your search above and press return to search.

'జైలర్' డైరెక్టర్ ని అవమానించిన రజినీ?

ఒక సినిమా సూపర్‌ హిట్ అయింది అంటే క్రెడిట్ ఖచ్చితంగా మెజార్టీ దర్శకుడికి ఇవ్వాల్సిందే. దర్శకుడి ప్రతిభ ఆధారంగానే సినిమా ఫలితాలు ఉంటాయి

By:  Tupaki Desk   |   19 Sep 2023 8:50 AM GMT
జైలర్ డైరెక్టర్ ని అవమానించిన రజినీ?
X

ఒక సినిమా సూపర్‌ హిట్ అయింది అంటే క్రెడిట్ ఖచ్చితంగా మెజార్టీ దర్శకుడికి ఇవ్వాల్సిందే. దర్శకుడి ప్రతిభ ఆధారంగానే సినిమా ఫలితాలు ఉంటాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్‌ అంటూ దర్శకుడిని అంటారు. కొందరు మాత్రం సినిమా సక్సెస్ క్రెడిట్ ను హీరోలకు కట్టబెట్టాలని చూస్తూ ఉంటారు. అయితే సక్సెస్ లో దర్శకుడిదే మెజార్టీ రోల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. దర్శకుడి పని తీరును మెచ్చుకోకుండా తక్కువ చేసి మాట్లాడాడు అంటూ రజినీకాంత్‌ పై పలువురు దర్శకులు ఇంకా సోషల్ మీడియా జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత జైలర్ తో రజినీకాంత్ ఒక బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకున్నాడు.

పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న సూపర్‌ హిట్ ని అందించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్ పై ప్రశంసలు కురిపించకుండా ఆయన పని తీరుపై కామెంట్స్ చేయడం, చిన్న చూపు చూసినట్లుగా కామెంట్స్ చేయడం ఏ మాత్రం సరికాదు. తాజాగా జైలర్ ఈవెంట్ లో రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రజినీకాంత్ మాట్లాడుతూ... రీ రికార్డింగ్ పూర్తి కాక ముందు నేను, నెల్సన్ స్నేహితుడు, సన్ పిక్చర్స్ కి చెందిన వ్యక్తి సినిమా ను చూశాం. నెల్సన్‌ స్నేహితుడికి సినిమా బాగా నచ్చింది, సూపర్‌ హిట్ ఖాయం అన్నాడు. నువ్వు నెల్సన్ స్నేహితుడివి కనుక అలా అనిపిస్తుంది. సినిమా ఎబో యావరేజ్ అన్నాను.

రీ రికార్డింగ్‌ తో సినిమా మొత్తం మారిపోయింది. అద్భుతంగా సినిమా వచ్చింది. రీ రికార్డింగ్ వల్ల సినిమా సూపర్‌ హిట్ అన్నట్లుగా రజినీకాంత్‌ చెప్పుకొచ్చాడు. అనిరుధ్‌ మ్యూజిక్ వల్లే సినిమా హిట్ అయిందని రజినీకాంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని చాలా మంది అంటున్నారు. ఎబో యావరేజ్ సినిమా ను సూపర్‌ డూపర్ హిట్ గా రీ రికార్డింగ్‌ మార్చిందా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. రజినీకాంత్ గతంలో బాషా సినిమా రీ రికార్డింగ్ వల్లే సూపర్‌ హిట్ అయిందని రజినీకాంత్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే కామెంట్ చేయడం తో వివాదం మొదలయ్యింది.