Begin typing your search above and press return to search.

టెన్షన్ షురూ.. జైలర్ కు లియో చెక్ పెడుతుందా?

అయితే ఈ సినిమా ఇప్పుడు రజనీకాంత్ జైలర్ రికార్డ్ లను బద్దలుకొడుతుందా అన్ని కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   23 Aug 2023 10:54 AM GMT
టెన్షన్ షురూ.. జైలర్ కు లియో చెక్ పెడుతుందా?
X

కోలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, అజిత్, సూర్య.. ఇలా చాలా మందే ఉన్నారు. వీరందరికీ పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ మార్కెట్ ఉంది. అలాగే అక్కడ తెరకెక్కుతున్న సినిమాలు కూడా ఒకదాని మించి ఇంకోటి రికార్డ్ వసూళ్లను అందుకుంటూ ముందుకెళ్తున్నాయి. అయితే కోలీవుడ్ లో ఎప్పుడు దళపతి విజయ్-అజిత్, దళపతి విజయ్-రజనీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడూ వివాదాలకు దిగుతుంటారు అన్న సంగతి తెలిసిందే. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ బాక్సాఫీస్ రికార్డులను కూడా లెక్కేసుకుంటుంటారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు దళపతి విజయ్ ఫ్యాన్స్ కు ఓ చిన్న టెన్షన్ మొదలు కానుంది. అదేంటంటే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో విడుదలకు రెడీ అవుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు రజనీకాంత్ జైలర్ రికార్డ్ లను బద్దలుకొడుతుందా అన్ని కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే రజనీ నటించిన జైలర్ రీసెంట్ గా ఆగస్ట్ 10న రిలీజై వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.550కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రజనీ కెరీర్ లో బిగ్గెట్ హిట్ గా నిలిచింది. వాస్తవానికి జైలర్ ఈ రేంజ్ లో భారీ సక్సెస్ ను అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే రజనీ చాలం కాలం సరైన హిట్ ను అందుకోలేక ఫామ్ లో లేరు. కానీ జైలర్ అంచనాలను పటాపంచ్ లు చేస్తూ రికార్డ్ వసూళ్లను అందుకుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్, కమల్ హాసన్ విక్రమ్ రికార్డ్ వసూళ్లను బ్రేక్ చేసి షాక్ కు గురి చేసింది.

అయితే ఇప్పుడు లియో వంతు వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోంది. ఇప్పటికే ఆ యూనివర్స్ నుంచి వచ్చిన ఖైదీ, విక్రమ్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్నాయి. దానికి తోడు లియోలో భారీ కాస్టింగ్ ఉంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. ఇప్పుటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

థియేట్రికల్ బిజినెస్ కూడా కళ్లు చెదిరే రేంజ్ లో అయింది. తమిళ సినిమా హిస్టరీలోనే అత్యధికంగా అయింది. అలాగే మిగతా భాషల్లోనే అలానే జరిగినట్లు తెలిసింది. మరి ఈ చిత్రం ఇప్పుడు.. జైలర్ రూ.550కోట్ల మార్క్ వసూళ్లను బ్రేక్ చేస్తుందా, రూ.600కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.