Begin typing your search above and press return to search.

జైలర్ కలెక్షన్స్.. ఇక ప్రాఫిట్స్ వేట మొదలైంది

తలైవా తాండవం చేస్తే ఎలా ఉంటుందో జైలర్ సినిమా నిరూపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు తెలుగులో అయితే మంచి కలెక్షన్స్ అందుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2023 8:12 AM GMT
జైలర్ కలెక్షన్స్.. ఇక ప్రాఫిట్స్ వేట మొదలైంది
X

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా కాలం తర్వాత సాలిడ్ సక్సెస్ అయితే సొంతం చేసుకుంటున్నాడు. గత పదేళ్ళ కాలంలో రజనీకాంత్ ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిస్థాయిలో అయితే సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ ఈసారి జైలర్ సినిమాతో మాత్రం అన్ని ఏరియాల లెక్కలు ఒకేసారి తేల్చేశాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వారికి భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందించే దిశగా జైలర్ దూసుకుపోతోంది.

తలైవా తాండవం చేస్తే ఎలా ఉంటుందో జైలర్ సినిమా నిరూపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు తెలుగులో అయితే మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. ఏపీ తెలంగాణలో మొదటిరోజు 7 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రెండవ రోజు 2 కోట్లకు పైగా షేర్ అందుకుంది. ఇక 3వ రోజు ఊహించని విధంగా 4.15 కోట్ల షేర్, 4వ రోజు అంతకంటే ఎక్కువగా 5 కోట్లకు పైగానే ఈ సినిమా షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు మొత్తంగా 18 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ రాగా 33 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ దక్కింది. తెలుగులో జైలర్ సినిమా 12 కోట్ల రేంజ్ లోనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక 13 కోట్ల టార్గెట్ ను అందుకుంటుందా లేదా అని అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని మొత్తం వెనక్కి తీసుకువచ్చి ప్రస్తుతం 6 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో ముందుకు కొనసాగుతోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తమిళనాడులో ఇప్పటికే 82 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కర్ణాటకలో 31 కోట్లు, కేరళలో 23 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.50 కోట్లు, ఓవర్సీస్ లో 125.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 301.25 కోట్లు గ్రాస్, 148.15 కోట్ల షేర్ సినిమాకు దక్కింది. జైలర్ సినిమా ఓవరాల్ గా 122.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.

ఇక ఈ సినిమా 124 కోట్ల టార్గెట్ కు నిన్ననే చాలా దగ్గరగా వచ్చింది. ఇక నిన్నటి మొత్తం కలెక్షన్స్ తో ఈ సినిమా ఇప్పటివరకు 24 కోట్లకు పైగా ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది. ఇక ఈరోజు నుంచి కూడా ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. రేపు కూడా హాలిడే కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కు జాక్ పాట్ అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరొక రికార్డు అందుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.