Begin typing your search above and press return to search.

రజనీ 'జైలర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది అసలు లెక్క

మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 122.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అంటే రూ. 124 కోట్ల షేర్-రూ.240కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్.

By:  Tupaki Desk   |   11 Aug 2023 9:01 AM GMT
రజనీ జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది అసలు లెక్క
X

ఆగస్ట్ 10న విడుదలైన రజనీకాంత్ 'జైలర్' మూవీ మంచి టాక్ ను తెచ్చుకుంది. అంచనాలను మించి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజే మంచి వసూళ్లను కూడా అందుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మంచి కలెక్షన్స్ దక్కాయి. రజనీ గత చిత్రాలతో పోలిస్తే ఈ జైలర్ చిత్రం తొలి రోజు భారీ స్థాయిలో షేర్ వసూళ్లను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రజనీ చివరి చిత్రం 'పెద్దన్న' రూ.1.60కోట్లు సాధించగా, 'దర్బార్' రూ.4.52కోట్లు, 'పేట' రూ.1.65కోట్లు వసూళ్లు మాత్రమే చేశాయి. అయితే వీటికన్నా ముందు 'రోబో 2.0' మాత్రం అత్యధికంగా రూ.12.5కోట్లను అందుకోంది.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జైలర్ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. నైజాంలో రూ. 3.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 94 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 81 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణాలో కలిపి రూ. 7.01 కోట్లు షేర్, రూ. 12.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగానూ మంచి వసూళ్లనే అందుకుందీ చిత్రం. తెలుగులో రూ. 12.50 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 22.85 కోట్లు, కర్నాటక రూ. 11.80 కోట్లు, కేరళలో రూ. 5.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35.10 కోట్లు గ్రా కలెక్ట్ అయింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 91.20 కోట్ల గ్రాస్‌, రూ. 44.75 కోట్లు షేర్ వచ్చాయి.

మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 122.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అంటే రూ. 124 కోట్ల షేర్-రూ.240కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్. మొదటి రోజు ఈ చిత్రం రూ. 44.75 కోట్లు అందుకుంది కాబట్టి.. ఇంకా 79.45 కోట్లు వసూలు చేయాలి. తెలుగులో ఈ చిత్రం రూ. 12 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు రూ. 7.01 కోట్లు అందుకుంది. దీంతో ఈ మూవీ రూ. 5.99 కోట్లు వసూలు చేయాలి.

ఎలాగో 'జైలర్'తో పాటు రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్'(ఆగస్ట్ 11) కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కాబట్టి. ఇకపై తెలుగు ఆడియెన్స్ 'జైలర్' సినిమాకే మొగ్గు చూపే అవకాశముంటుంది. దీంతో 'జైలర్'కు మరిన్ని థియేటర్లు కూడా పెరుగుతాయి. కాబట్టి 'జైలర్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.