Begin typing your search above and press return to search.

ఆ 9 రోజుల్లో వెయ్యి కోట్లు.. బాక్సాఫీస్ షేక్

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 12:05 PM GMT
ఆ 9 రోజుల్లో వెయ్యి కోట్లు.. బాక్సాఫీస్ షేక్
X

సినీ ఇండస్ట్రీలో ఇండిపెండెన్స్ బాక్సాఫీస్ కు మంచి గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో రిలీజైన చిత్రాలు దాదాపుగా మంచి వసూళ్లను అందుకుంటుంటాయి. అలానే ఈ ఏడాది కూడా జరిగింది. ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15.. రిలీజైన చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్​పై కాసుల వర్షాన్ని కురిపించాయి. కలెక్షన్ల వరద పారింది.

పంద్రాగస్టు రోజు హాలీడే కావడం వల్ల ఆ ఒక్క రోజే ఏకంగా రూ.150 కోట్ల వరకు వసూలు అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పండగ ముందు వెనక కలిసి దాదాపు వారం రోజుల గ్రాస్ వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి. పంద్రాగస్ట్ సందర్భంగా రిలీజైన చిత్రాలు ఎనిమిది రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ ను టచ్ చేశాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు తెలిపాయి.

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు తొమ్మిది రోజుల్లో రూ.449.75కోట్లను అందుకుని కలెక్షన్ల సునామీ సృష్టించింది. త్రిపుల్ డిజిట్ కలెక్షన్లతో రఫ్పాడించింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ ఆగస్ట్ 11న విడుదలై భారీ డిజాస్టర్ ను అందుకోగా మోస్తరు వసూళ్లను అందుకుంది. మొత్తంగా ఎనిమిది రోజుల్లో రూ.43.55కోట్లను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ చిత్ర వసూళ్లు పెరిగే అవకాశం లేదు.

అలా సౌత్​లో రజనీ 'జైలర్​' హవా నడుస్తుంటే.. నార్త్​లో 'గదర్-2', 'ఓఎంజీ-2' సినిమాలు బాగా రాణిస్తున్నాయి. జైలర్ లా గదర్ 2 సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్​ ముందు సూపర్​హిట్​గా నిలిచిన ఈ చిత్రంలో సన్నీ డియోల్- అమీషా పటేల్ కలిసి నటించారు. మొదటి రోజు నుంచే భారీగా వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పటివరకు ఎనిమిది రోజుల్లో రూ.396కోట్ల వసూళ్లను అందుకుంది. మరోవైపు రోజు రోజుకు రెస్పాన్ పెంచుకుంటూ పోతున్న 'ఓఎంజీ-2'కు మొదటి రోజు తక్కవ కలెక్షన్లు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత రోజు నుంచి పెరుగుతూ పస్తోంది.

మొత్తంగా ఈ ఇండిపెండెన్స్ డే రోజు కలెక్షన్లలో రజనీ జైలర్ పైచేయి సాధించింది. ఆ తర్వాతి స్థానంలో దేశభక్తి చిత్రంగా వచ్చిన గదర్ 2 నిలవగా.. మూడో స్థానంలో ఉన్న ఓఎంజీ-2 మంచి హోల్డ్​తో వసూళ్లు అందుకుంది. ఒక్క భోళాశంకరే మైనర్ వసూళ్లను అందుకుని చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ నాలుగు చిత్రాలు కలిపి రూ. వెయ్యి(1,019) కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.