Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ కోసం బాల‌య్య అన్ని రోజులు కేటాయించాడా?

అంతే కాకుండా ఈ మూవీ షూటింగ్ కోసం బాల‌య్య ఏకంగా 20 రోజుల కేటాయించార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

By:  Tupaki Desk   |   10 May 2025 6:07 AM
ర‌జ‌నీ కోసం బాల‌య్య అన్ని రోజులు కేటాయించాడా?
X

క్రేజీ స్టార్ల సీక్వెల్స్‌ల‌లో స్టార్ హీరోలు గెస్ట్‌లుగా న‌టించ‌డం ఇప్పుడు ఆన‌వాయితీగా మారింది. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'జైల‌ర్‌'లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీల‌క అతిథి పాత్ర‌ల్లో న‌టించి స‌ర్ ప్రైజ్ చేయ‌డం తెలిసిందే. కీల‌క ఘ‌ట్టాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచి సినిమా బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో త‌మ వంతు పాత్ర‌ని పోషించి 'జైల‌ర్‌' రికార్డుల్లో భాగం కావ‌డం తెలిసిందే.

ర‌జ‌నీపై ఉన్న అభిమానం, ఆయా పాత్ర‌ల‌కున్న ప్రాముఖ్య‌త కార‌ణంగా మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్ న‌టించి ఆ పాత్ర‌ల‌ని ర‌క్తిక‌ట్టించారు. నెల్స‌న్ దిలీప్‌కుమార్ డైరెక్ష‌న్‌లో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించి రూ.650 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ర‌జ‌నీ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'జైల‌ర్ 2'ని తెర‌కెక్కిస్తున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండ‌గా, స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇందులో ఎస్‌.జె. సూర్య కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ మ‌రో సారి అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. త‌న‌తో పాటు ఈ మూవీలో కీల‌క అతిథిగా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్నార‌ని, ఇప్ప‌టికే ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఈ టీమ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కానీ 'జైల‌ర్ 2'లో మాత్రం బాల‌య్య కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు మాత్రం క‌న్ఫ‌ర్మ్ చేసేశాయి.

అంతే కాకుండా ఈ మూవీ షూటింగ్ కోసం బాల‌య్య ఏకంగా 20 రోజుల కేటాయించార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. 20 రోజులు డేట్స్ ఇచ్చారంటే బాల‌య్య క్యారెక్ట‌ర్ నిడివి ఎంత ఉండ‌నుంద‌న్న‌ది అర్థం చేసుకోవ‌చ్చు అని, ర‌జ‌నీతో క‌లిసి బాల‌య్య క‌నిపించ‌నున్న సీన్స్ ఆడియ‌న్స్‌కు పూన‌కాలు తెప్పిస్తాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య 'అఖండ‌' సీక్వెల్ 'అఖండ 2'లో న‌టిస్తున్నారు. బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.