జైలర్ లో సింహం గర్జన పీక్స్ లోనే!
సూపర్ స్టార్ రజనీకాంత్ కాథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శత్వంలో `జైలర్ 2` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 12:35 PMసూపర్ స్టార్ రజనీకాంత్ కాథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శత్వంలో `జైలర్ 2` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `జైలర్` లో ఉన్న పాత్రలతో పాటు అదనంగా కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతున్నాయి. టాలీవుడ్ నుంచి నటసింహ బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. `జైలర్` లాంటి కంటెంట్ కి సింహం తోడైతే పీక్స్ లో ఉంటుంది.
అందుకే ఏరికోరి మరీ నెల్సన్ బాలయ్యని రంగంలోకి దించుతున్నట్లు తొలి నుంచి వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య రోల్ లీక్ అయింది. ఇందులో బాలయ్య పవర్ పుల్ పోలీస్ పాత్ర పోసిస్తున్నారుట. తెరపై కనిపించేది కాసేపే అయినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఆ పాత్ర ఉంటుందని సమాచారం. బాలయ్య రోల్ ప్లాష్ బ్యాక్ లో వస్తుందిట. తొలి భాగంలో శివరాజ్ కుమార్ పాత్రలో ఎంతటి సీరియస్ కనిపిస్తుందో తెలిసిందే.
అలాగే మోహన్ లాల్ రోల్ సీరియస్ గా చూపిస్తూనే కామెడీని హైలైట్ చేసారు. కానీ బాలయ్య రోల్ మాత్రం ఆయన రియల్ లైప్ దగ్గరగా చాలా యాంగర్ గా ఉంటుందని సమాచారం. ఒంటిమీద యూనిఫాం ఉంటే బాలయ్య శివతాండవం ఆడేస్తారు. గతంలో `రౌడీ ఇనస్పెక్టర్`, `లక్ష్మీ నరసింహ` సినిమాల్లో బాలయ్య శక్తివంతమైన పోలీస్ పాత్రలతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాల్లో ఓల్డ్ వెర్షన్ బాలయ్య కనిపిస్తారు.
కానీ `జైలర్ 2` లో పోలీస్ వేరే లెవల్లో ఉంటాడని అంటున్నారు. మునుపెన్నడు చూడని సరికొత్త బాలయ్యని ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య ఎంట్రీలో నిజమెంత? అన్నది తేలాలి. ఇంతవరకూ మేకర్స్ బాలయ్య ఎంట్రీ గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అలాగే జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించలేదు. రెండు...మూడు సార్లు బాలయ్య నటిస్తే బాగుంటుందనే పాజిటవ్ గానే నెల్సన్ స్పందించారు. బాలయ్య ఎంట్రీ నిజమైతే గనుక ఇదే ఆయన తొలి తమిళ చిత్రం కూడా అవుతుంది.