Begin typing your search above and press return to search.

బాహుబలి ట్విస్ట్ తో జై హనుమాన్..!

ఓ విధంగా ఇది బాహుబలి తరహాలోనే సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎదురుచూసేలా చేసిందని చెప్పొచ్చు. హనుమాన్ సీక్వెల్ కి జై హనుమాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:13 AM GMT
బాహుబలి ట్విస్ట్ తో జై హనుమాన్..!
X

ప్రశాంత్ వర్మ డైరెక్టోరియల్ హనుమాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. సంక్రాంతికి చిన్న సినిమాగా రంగంలోకి దిగిన హనుమాన్ తన బలం తను తెలుసుకున్న హనుమంతుడు ఎలా వీర ప్రతాపం చూపించగలడో అలానే ఈ సినిమా ప్రభావం వసూళ్ల మీద చూపించబోతుంది. తెలుగు తో పాటుగా అన్ని సౌత్ భాషల్లో హిందీలో కూడా హనుమాన్ గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా సూపర్ రెస్పాన్స్ అందిస్తున్నారు.

ఒక భక్తుడికి హనుమంతుడు సూపర్ పవర్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా చేశారు. అయితే ఈ సినిమాలో ఎక్కడ తన లైన్ దాటకుండా చాలా తెలివిగా తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ సినిమా చివర్లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన ట్విస్ట్ అయితే మరోసారి ఆడియన్స్ కి బాహుబలి గుర్తు చేసిందని చెప్పొచ్చు. హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో హనుమతుడికి సంబంధించిన సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అంతేకాదు ఆ సీన్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా చేసింది.

సినిమాలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ ఇస్తూ జై హనుమాన్ అంటూ సినిమా సీక్వెల్ ని ప్రకటించారు. ఓ విధంగా ఇది బాహుబలి తరహాలోనే సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎదురుచూసేలా చేసిందని చెప్పొచ్చు. హనుమాన్ సీక్వెల్ కి జై హనుమాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రశాంత్ వర్మ క్రియేటివ్ యూనివర్స్ లో మన ఆధ్యాత్మిక కథల్లోని సూపర్ హీరోస్ ని కథాంశం గా తీసుకుని తను సినిమాలు చేయాలని చూస్తున్నాడు.

హనుమాన్ సినిమా తెరకెక్కించే టైం లోనే ఇది ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ అని గట్టిగా ప్రచారం చేస్తూ వచ్చారు ప్రశాంత్ వర్మ. సినిమాపై తను పెట్టిన ఎఫర్ట్ ఏంటన్నది ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది. తేజా సజ్జా కూడా లీడ్ రోల్ లో అదరగొట్టాడు. సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య కాన్ఫిడెంట్ గా వచ్చిన హనుమాన్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్నాడు. ఇక బాక్సాఫీస్ పై హనుమాన్ వీర ప్రతాపం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ నుంచి ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మరెన్నో వస్తాయని చెప్పొచ్చు.