Begin typing your search above and press return to search.

సీక్వెల్ కి పదింతలు బడ్జెట్ ఫిక్స్..!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రభంజనం సృష్టించింది

By:  Tupaki Desk   |   23 Feb 2024 12:30 AM GMT
సీక్వెల్ కి పదింతలు బడ్జెట్ ఫిక్స్..!
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రభంజనం సృష్టించింది. నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ సినిమా పాతిక కోట్ల బడ్జెట్ తో తెరకెకెక్కింది. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని ఊహించలేదు. 30 కోట్లకు 300 కోట్లు వసూళ్లను రాబట్టిన ఈ సినిమా చివర్లో జై హనుమాన్ అంటూ సీక్వెల్ ట్విస్ట్ ఇచ్చారు.

ఈ సీక్వెల్ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సినిమా సీక్వెల్ పై బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్లాన్ చేస్తున్నారట. పాతిక కోట్ల బడ్జెట్ తోనే హనుమాన్ సినిమాను అంత మంచి అవుట్ పుట్ తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ జై హానుమాన్ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

తక్కువ బడ్జెట్ తోనే ఇంత మంచి అవుట్ పుట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం పదింతలు బడ్జెట్ తో భారీ రేంజ్ లో చేస్తున్నారట. అదే జరిగితే జై హనుమాన్ మూవీ ఈసారి ఆడియన్స్ ఎంత అంచనాలు పెట్టుకుంటారో దానికి మించి ఉంటుందని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ 2025 లోనే జై హనుమాన్ రిలీజ్ అని ప్రకటించినా సినిమా కోసం కాస్త టైం తీసుకోవాలని అనుకుంటున్నాడట.

ప్రశాంత్ వర్మ హనుమాన్ తో పాటుగా అధీరా, మహాకాళి సినిమాలు మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే జై హనుమాన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. హనుమాన్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ జై హనుమాన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. జై హనుమాన్ ఆశించిన రేంజ్ లో ఉంటే మాత్రం అది కూడా ప్రభంజనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గా ఎవరు చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రోజుకొక కొత్త పేరు వినిపిస్తుండగా ప్రశాంత్ వర్మ మైండ్ లో అసలు హనుమాన్ ఎవరున్నారో తెలియాల్సి ఉంది. జై హనుమాన్ బడ్జెట్ పరంగానే కాదు కాస్టింగ్ పరంగా కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది.