10 కోట్ల ఖరీదైన అపార్ట్‌మెంట్‌లోకి సాధారణ నటుడు!
తాజా అప్‌డేట్ ప్రకారం.. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఒక కొత్త నివాసాన్ని జైదీప్ కొనుగోలు చేశారు.
By: Tupaki Desk | 5 Jun 2025 9:00 PM ISTసినిమాలు, వెబ్ సిరీస్‌లలో తన శక్తివంతమైన నటనతో పేరు తెచ్చుకున్న జైదీప్ అహ్లవత్ నిరంతరం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జైదీప్ తెలుగు నటుడు ప్రభాస్ కి హిందీలో డబ్బింగ్ కూడా చెబుతాడు. జైదీప్ అహ్లవత్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం జ్యువెల్ థీఫ్‌లో కనిపించారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు.
తాజా అప్‌డేట్ ప్రకారం.. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఒక కొత్త నివాసాన్ని జైదీప్ కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన ఆస్తి విలువ రూ. 10 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. విశాలమైన అపార్ట్‌మెంట్‌లో కొంతమంది ప్రముఖ హిందీ నటులు కూడా నివసిస్తున్నారు.
బాలీవుడ్ లో స్టార్లు నిరంతరం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే జైదీప్ లాంటి స్వీయ నిర్మిత నటుడు ఈ స్తాయికి ఎదిగేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. అతడు మధ్యతరగతి నేపథ్యం నుంచి పరిశ్రమకు వచ్చి ఇంతింతై ఎదుగుతున్నాడు.
