జై హనుమాన్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా..?
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుంది అమ్మడు.
By: Tupaki Desk | 27 April 2025 3:00 AMహనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుంది అమ్మడు. ఐతే హనుమాన్ కథను కొనసాగిస్తూ జై హనుమాన్ అంటూ సీక్వెల్ తో ట్విస్ట్ ఇచ్చాడు. 2025 లోనే ఆ సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పటివరకు జై హనుమాన్ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ లో లీడ్ రోల్ గా కాంతారా స్టార్ రిషబ్ శెట్టిని ఫిక్స్ చేశారు.
ఆయనేమో కాంతారా ప్రీక్వెల్ పూర్తి చేసే వరకు మరో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే జై హనుమాన్ కి డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే జై హనుమాన్ సెట్స్ లోకి రిషబ్ వచ్చే ఛాన్స్ లు ఉన్నాయట. అందుకే ప్రశాంత్ వర్మ కూడా ఈ టైం లో మిగతా వర్క్ ని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఐతే జై హనుమాన్ సినిమా ఈ ఇయర్ అసలు సెట్స్ మీద వెళ్తుందా అన్న డౌట్ కూడా ఉంది.
కాంతారా పూర్తి చేసే దాకా రిషబ్ అయితే బయట సినిమాకు పనిచేసే అవకాశం లేదు. కాంతారా 2 కి ఆయన నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా తన బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే జై హనుమాన్ కి టైం ఇప్పుడు ఇవ్వలేనని చెబుతున్నాడట. ఒకవేళ ఈ ఇయర్ ఎండింగ్ లో రిషబ్ జై హనుమాన్ కి డేట్స్ ఇచ్చినా ఎలా లేదన్నా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏడాది జరుగుతుంది. సో 2025 రిలీజ్ అనుకున్న జై హనుమాన్ కాస్త 2026 చివర్లో లేదా 2027 కి వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టితో పాటు మిగతా స్టార్ కాస్ట్ విషయంలో కూడా మేకర్స్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ ని నో కాంప్రమైజ్ అనేలా తెరకెక్కించేలా చూస్తున్నారట. ఐతే ప్రశాంత్ వర్మ మాత్రం జై హనుమాన్ ని త్వరగా ముగించాలని చూస్తున్నా నటీనటుల వల్ల లేట్ అవుతుందని తెలుస్తుంది. జై హనుమాన్ తో పాటు ప్రశాంత్ వర్మ మరో రెండు ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసి ఉన్నాడు కానీ ఏ ఒక్కటి కూడా ముందుకు కదలట్లేదు.