Begin typing your search above and press return to search.

ఫోటో షూట్ తో ఫేట్ మారిపోయింది..!

ఆ ఫోటో షూట్ మళ్లీ తనని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. జగ్గూ భాయ్ ఫోటో షూట్ చూసి బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో విలన్ పాత్రకు పర్ఫెక్ట్ అని అనుకున్నారట.

By:  Tupaki Desk   |   12 Feb 2024 2:30 PM GMT
ఫోటో షూట్ తో ఫేట్ మారిపోయింది..!
X

శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా లేడీ ఫ్యాన్స్ ని సంపాదించిన హీరో జగపతి బాబు. 1989 లో సింహ స్వప్నం సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన శుభలగ్నం, శుభాకాంక్షలు, మావిచిగురు, పెళ్లిపందిరి, పెళ్లి పీటలు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. జగపతి బాబు సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాగా అందరి మెప్పు పొందారు. హీరోగా దాదాపు కెరీర్ ముగిసింది అనుకున్న టైం లో కథా బలం ఉన్న సినిమాల్లో మంచి పాత్రలు చేయాలని అనుకున్నారు. అయితే ఆ టైం లో ఒక ఫోటో షూట్ తనకు మళ్లీ అవకాశాలు తెచ్చాయని అంటున్నారు జగపతి బాబు.


ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హీరోగా చేసింది చాలు కథా బలం ఉన్న సినిమాలు చేయాలని అనుకున్నా అవకాశాల కోసం ఎదురు చూశా.. కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా. ఆ టైం లో చాలామంది చులకనగా కూడా చూశారట. అయితే ఆ సమయంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఒక ఫోటో షూట్ చేశారు జగపతి బాబు.

ఆ ఫోటో షూట్ మళ్లీ తనని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. జగ్గూ భాయ్ ఫోటో షూట్ చూసి బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో విలన్ పాత్రకు పర్ఫెక్ట్ అని అనుకున్నారట. అలా తనని పిలిచి కథ చెప్పగా స్క్రిప్ట్ నచ్చి లెజెండ్ విలన్ గా ఓకే చెప్పానని అన్నారు జగపతి బాబు. విలన్ గా చేసిన మొదటి ప్రయత్నమే అయినా తను అనుకున్న దాని కన్నా ఎక్కువ పారితోషికం ఇచ్చారని అన్నారు జగపతి బాబు.

అలా లెజెండ్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మన జగ్గూ భాయ్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. స్టైలిష్ విలన్ గా జగపతి బాబు తన మార్క్ చూపిస్తున్నారు. శ్రీమంతుడు, మహర్షి, రంగస్థలం, నాన్నకు ప్రేమతో ఇలా స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో కూడా జగపతి బాబు నటించారు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న జగపతి బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు అందిస్తుంది తుపాకి.కామ్. ఆయన ఇలానే వెరైటీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని ఆశిద్దాం.