Begin typing your search above and press return to search.

జగ్గూభాయ్.. సలార్ తో మరో మెట్టు

ఈ సినిమాలో అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఇప్పటికే పోస్టర్స్ తో రివీల్ చేశారు. తాజాగా జగపతి బాబు ఇన్ స్టాగ్రామ్ లో స్టైలిష్ పిక్ షేర్ చేశాడు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 11:48 AM GMT
జగ్గూభాయ్.. సలార్ తో మరో మెట్టు
X

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు జగపతి బాబు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ తెచ్చుకున్న జగపతి బాబు కెరియర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతో కూడా ప్రూవ్ చేసుకున్నారు. లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ అయిన జగపతి బాబుకి ఆ మూవీ మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.

అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా టాలీవుడ్ లో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. నాన్నకు ప్రేమతో మూవీలో స్టైలిష్ విలన్ గా, రంగస్థలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తనదైన విలనిజం పాడించాడు. విలన్ పాత్రలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడాకీలక రోల్స్ చేస్తూ నటుడిగా సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగిస్తున్నారు.

వయస్సు పెరుగుతున్న కూడా స్టైలిష్ లుక్ తో మోడల్ లా జగపతి బాబు తనని తాను రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా జగపతి బాబు యాక్టివ్ గా ఉంటూ తనని తాను కొత్తగా షోకేస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రిలీజ్ కి రెడీ అవుతోన్న సలార్ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించాడు.

ఈ సినిమాలో అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఇప్పటికే పోస్టర్స్ తో రివీల్ చేశారు. తాజాగా జగపతి బాబు ఇన్ స్టాగ్రామ్ లో స్టైలిష్ పిక్ షేర్ చేశాడు. బ్లాక్ కాస్ట్యూమ్స్ లో అతని మేకోవర్ అద్భుతంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఫోటోకి జగపతి బాబు ఇంటరెస్టింగ్ కామెంట్ పెట్టారు. సలార్ తో పై మెట్టు ఎక్కబోతున్నాను అంటూ జగపతిబాబు పోస్ట్ పెట్టారు.

దీనిని బట్టి సలార్ సినిమాలో జగపతి బాబు తన పాత్రపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్ధమవుతోంది. అలాగే కేజీఎఫ్ లో అధీరా కంటే పవర్ ఫుల్ పాత్రని సలార్ సినిమాలో జగపతి బాబుకి లభించిన్దనే మాట వినిపిస్తోంది. జగపతి బాబు షేర్ చేసిన స్టైలిష్ లుక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి లుక్స్ తో హీరోగా ఒక సినిమా పడితే జగపతిబాబు నుంచి నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.