Begin typing your search above and press return to search.

జగతి మేడం గ్లామర్ బ్లాస్ట్ రిపీట్!!!

సీరియల్‌ లో చీరకట్టులో అమ్మ పాత్రలో, టీచర్ పాత్రలో ఎంతో పద్ధతిగా కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   10 Feb 2024 5:30 PM GMT
జగతి మేడం గ్లామర్ బ్లాస్ట్ రిపీట్!!!
X

బుల్లితెరపై సీరియల్స్ చూసే వారికి జ్యోతి రాయ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. జగతి మేడం అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆమె నటించిన సీరియల్ గుప్పెడంత మనసు టాప్ టీఆర్పీ రేటింగ్ ‏తో దూసుకుపోతోంది. అందులో ప్రస్తుతం జగతి క్యారెక్టర్ చనిపోయినప్పటికీ.. ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్‌ లో చీరకట్టులో అమ్మ పాత్రలో, టీచర్ పాత్రలో ఎంతో పద్ధతిగా కనిపిస్తుంది.


కానీ నెట్టింట్లో మాత్రం యంగ్ హీరోయిన్‌ లా అందాల ప్రదర్శనతో నెటిజన్లను నిద్ర పట్టకుండా చేస్తుంటుంది జగతి అలియాస్ జ్యోతి రాయ్! గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో దగ్గరైంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. తన ఇన్ స్టా చూస్తే మాత్రం ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. హద్దులు దాటి మరీ అందాలు ఆరబోస్తుంటుంది.

హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ పోజులు ఇస్తుంటోంది జ్యోతి రాయ్. ట్రెండీ ఔట్ ఫిట్లలో దర్శనమిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే ఫొటోను షేర్ చేసింది. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ సింగిల్ పీస్ డ్రెస్ లో సెగలు పుట్టించింది. బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుని అట్రాక్ట్ చేస్తోంది. మిస్ట్రస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సూపర్ స్కిన్ షోతో కుర్రకారును ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఆమె గ్లామరస్ పిక్ కు వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి.

ఇప్పుడు సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన జగతి.. ఓటీటీలో వెబ్ సిరీసులు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. మాస్టర్ పీస్ అనే ఓ కన్నడ సినిమాతో పాటు.. వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ లో జ్యోతి నటిస్తుండగా.. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు, జ్యోతి రాయ్.. కన్నడకు చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ప్రేమ మాత్రమే కాదు.. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే జ్యోతి తన పేరును జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది. భర్త పేరునే చివర అలా పెట్టుకుంటారు. కాబట్టి జ్యోతి, పూర్వాజ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆల్రెడీ వివాహం చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయింది. మరి సెకండ్ మ్యారేజ్ విషయంలో ఆమె ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.