Begin typing your search above and press return to search.

నిజంగానే హాలీవుడ్‌ పిలుస్తోందా జగ్గుభాయ్‌..?

సీనియర్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. విలన్ రోల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను దక్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:46 AM GMT
నిజంగానే హాలీవుడ్‌ పిలుస్తోందా జగ్గుభాయ్‌..?
X

సీనియర్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. విలన్ రోల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఈ మధ్య కాలంలో జగపతిబాబు నటించిన ప్రతి సినిమా కూడా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుందనే టాక్‌ దక్కించుకుంటున్న విషయం తెల్సిందే.


కేవలం టాలీవుడ్‌ లోనే కాకుండా జగ్గూభాయ్ తమిళ్‌, హిందీ భాషల్లో కూడా నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న జగ్గూ భాయ్ త్వరలో మరో మెట్టు ఎక్కబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చేసిన పోస్ట్‌ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

తాజాగా ఈ ఫోటోను షేర్‌ చేసిన జగపతిబాబు హాలీవుడ్‌ పిలుస్తోంది... ఏమంటారు అంటూ కామెంట్‌ పెట్టాడు. అంటే హాలీవుడ్‌ ఆఫర్ వచ్చింది... వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్లుగా జగ్గూ భాయ్ ఆలోచిస్తున్నాడా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్‌ నుంచి పిలుపు వస్తే కచ్చితంగా వెళ్లాల్సిందే అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫ్యామిలీ హీరోగా ఎన్నో హిట్స్ దక్కించుకుని ఒకానొక సమయంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో పోటీ పడ్డ జగపతిబాబు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ కి వెళ్తున్నాడు అంటే తెలుగు వారంతా కూడా గర్వించదగ్గ విషయం. హాలీవుడ్‌ లో మంచి పాత్రలు దక్కితే ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా జగ్గూ భాయ్‌ ని చూసి గర్విస్తుంది అనడంలో సందేహం లేదు. హాలీవుడ్‌ కి వెళ్లేందుకు గాను జగ్గూ భాయ్ కి ఆల్‌ ది బెస్ట్‌.