Begin typing your search above and press return to search.

జగపతిబాబు-అనసూయ.. సింబా

'సింబా'కు ది ఫారెస్ట్ మ్యాన్ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఒక చెట్టు బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

By:  Tupaki Desk   |   27 May 2024 10:21 PM IST
జగపతిబాబు-అనసూయ.. సింబా
X

ఒకప్పుడు హీరోగా వైభవం చూసిన జగపతి బాబు.. చాలా ఏళ్ల నుంచి విలన్, క్యారెక్టర్ రోల్సే చేస్తున్నారు. ఇప్పుడాయన లీడ్ రోల్‌లో ఒక సినిమా తెరకెక్కుతుండడం విశేషం. అందులో అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆమె జగపతిబాబుకు జోడీగా నటిస్తోందా లేదా అన్నది తెలియదు కానీ.. ఈ చిత్రమైన కాంబినేషన్లో సినిమా రూపొందుతోంది.

ఆ చిత్రం పేరు.. సింబా. ఓవైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూనే మరోవైపు ప్రొడక్షన్లోనూ బిజీగా ఉంటున్న సంపత్ నంది ఈ చిత్రాన్ని దాసరి రాజేందర్ రెడ్డి అనే మరో నిర్మాతతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మురళీ మనోహర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అనీష్ కురువిల్లా, దివి, కబీర్ సింగ్ దుల్హాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

'సింబా'కు ది ఫారెస్ట్ మ్యాన్ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఒక చెట్టు బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ప్రకృతి కోసం పాటుపడే ఒక వ్యక్తి కథలా అనిపిస్తోంది క్యాప్షన్, ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తున్న ఇలాంటి చిత్రాన్ని ఈ రోజుల్లో రూపొందించడం ఆశ్చర్యమే.

సందేశాలు ఇస్తే జనాలు చూసే రోజులు కావివి. 'సింబా' అనగానే అందరికీ హాలీవుడ్ మూవీ 'లయన్ కింగ్' గుర్తుకు వస్తుంది. దాని తెలుగు వెర్షన్లో జగపతిబాబు విలన్ పాత్రకు వాయిస్ ఇవ్వడం విశేషం. ఇప్పుడేమో 'సింబా' అనే టైటిల్‌తో రాబోతున్న చిత్రంలో ఆయన లీడ్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.