Begin typing your search above and press return to search.

సెకండ్ ఇన్నింగ్స్.. ఆయనకు నో శాటిస్ఫాక్షన్..!

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమా నటుడిగా జగపతి బాబుకి పునర్జన్మనిచ్చింది

By:  Tupaki Desk   |   3 April 2024 12:30 AM GMT
సెకండ్ ఇన్నింగ్స్.. ఆయనకు నో శాటిస్ఫాక్షన్..!
X

ఫ్యామిలీ హీరోగా జగపతి బాబుకి ఒకప్పుడు మంచి లేడీ ఫాలోయింగ్ ఉండేది. శోభన్ బాబు తర్వాత మహిళా అభిమానులు ఎక్కువగా ఇష్టపడ్డ హీరోగా జగపతి బాబు గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఎన్నో సినిమాల్లో అలరించిన ఆయన చిన్నగా గ్రాఫ్ పడిపోతూ వచ్చిన విషయం గుర్తించారు. ఇక తను లీడ్ రోల్ లో సినిమాలు చేయడం కష్టమని భావించి సడెన్ గా విలన్ అవతారం ఎత్తారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమా నటుడిగా జగపతి బాబుకి పునర్జన్మనిచ్చింది.

లెజెండ్ లో విలన్ గా తన సత్తా చాటిన జగపతి బాబు ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ఒకానొక దశలో జగపతి బాబు సినిమా లేదన్నట్టుగా ఛాన్సులు వచ్చాయి. అంతేకాదు విలన్ అంటే చాలు జగపతి బాబు అనేలా సినిమాలు చేశారు. అయితే లెజెండ్ తర్వాత దాదాపు 90 సినిమాల్లో నటించిన జగపతి బాబు అందులో సంతృప్తిని ఇచ్చిన సినిమాలు చాలా తక్కువ అని అంటున్నారు.

చేయడానికి 90కి పైగా సినిమాలు చేసినా అవి జేబు శాటిస్ఫాక్షన్ ఇచ్చాయి తప్ప జాబ్ శాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని అంటున్నారు. పెద్ద సినిమాలు మాత్రమే చేస్తున్నానని చెప్పి చిన్న సినిమాలు ఇవ్వడం మానేశారు. ఈమధ్య చిన్న సినిమాలు బాగుంటున్నాయి. జగపతి బాబు అంటే కేవలం పెద్ద సినిమాలు చేస్తాడు చిన్న సినిమాలు చేయడని అనుకుంటున్నారు. పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాగా వాటి కోసం డేట్స్ ఇస్తే అవి ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వేరే సినిమా అవకాశాలు మిస్ అవుతున్నాయని అంటున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలు తనను మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేలా చేసినా సరే తనకు మాత్రం జాబ్ శాటిస్ఫాక్షన్ లేదని చెబుతున్నారు జగ్గు భాయ్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న భారీ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. వాటితో అయినా మళ్లీ జగపతి బాబు తన సత్తా చాటుతారేమో చూడాలి. జగపతి బాబు మాటలను బట్టి చూస్తుంటే తన కోసం ఛాలెంజింగ్ రోల్స్ రాయండి వాటిని చేసేందుకు తాను రెడీ అన్నట్టుగా ఉంది. మరి జగపతి బాబు హింట్స్ ని పట్టే దర్శక నిర్మాతలు ఎవరో చూడాలి. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న సినిమాల్లో జగపతి బాబు కూడా భాగం అవుతున్నారు. అయితే ఏదో జగపతి బాబు ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టు కాకుండా ఆయన్ను సరిగా వాడుకుంటే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్.