Begin typing your search above and press return to search.

చనిపోయాక లైఫ్ ఇంతకంటే బెటర్ గా ఉంటుందా?

జ‌గ‌ప‌తి చాలా కొత్త విష‌యాలు మాట్లాడ‌టంతోనే ఇంట‌ర్వ్యూ నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. సినిమా విశేషాల‌కు భిన్నంగా ఈ ఇంట‌ర్వ్యూ హైలైట్ అవ్వ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:00 AM GMT
చనిపోయాక లైఫ్ ఇంతకంటే బెటర్ గా ఉంటుందా?
X

జ‌గ‌ప‌తి బాబు ఇప్ప‌టి కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. విల‌న్ గా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లోనూ కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఒక‌ప్ప‌టి హీరో జ‌ర్నీకి పూర్తి భిన్నంగా ఆయ‌న ప్ర‌యాణం సాగుతుంది. ఒక‌ప్పుడు ఫ్యామిలీ స్టార్ గా ఇమేజ్ ఉన్న జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు పూర్తిగా కొత్త ట‌ర్నీంగ్ తీసుకుని ముందుకు సాగుతున్నాడు. జ‌గ‌ప‌తి బాబు ట్యాలెంట్ కి..బ్యాక‌ప్ కి ఇండ‌స్ట్రీలో ఆయ‌న రేంజ్ మ‌రోలా ఉంటుంద‌ని చాలా మంది భావించారు.

కానీ ఆయ‌న జ‌ర్నీ అలా సాగలేదు. తాజాగా ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. 'ఒకప్పటి నా లైఫ్ స్టైల్ వేరు .. ఇప్పటి నా లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు నా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. జీవితంలో చివ‌రి ప‌దేళ్ల కాలం చాలా విలువైన‌దిగా భావిస్తాను. తృప్తి వలన సంతోషం .. సంతోషం వలన ఆరోగ్యం లభిస్తాయని నేను నమ్ముతాను. మ‌న‌సుకు..శ‌రీరానికి శిక్ష‌ణ‌ చాలా అవ‌స‌రం.

స‌రైన ట్రైనింగ్ అనేది ముందు నుంచి ఇస్తున్న‌ప్పుడే! ఆ రెండూ మ‌న‌ మాట వింటాయి . ఒంట‌రి త‌నాన్ని త‌ట్టుకుని తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తాయి' తొలి నుంచి దెయ్యాలంటే భ‌యం. అవి ఉన్నాయో! లేదో తెలియ‌దు గానీ నాకు మాత్రం భ‌యం. ఇరుకైన ప్ర‌దేశాలైనా అంతే ఆందోళ‌న క‌లిగిస్తాయి. వీలైనంత వ‌ర‌కూ అలాంటి స్పాట్స్ కి వెళ్ల‌కుండా ఉంటాను. అలాగే మ‌నిషి చనిపోయాక ఏం జ‌రుగుతుంది! అనే ఆలోచ‌న నాకు కూడా చాలా భ‌యాన్ని క‌లిగిస్తుంది.

చ‌నిపోయాక లైఫ్ ఇంక క‌ష్టంగా ఉంటుందా? లేక బ్ర‌తికున్న జీవితం కంటే బెట‌ర్ గా ఉంటుందా? బాధ‌గా ఉంటుందా? అస‌లు అప్పుడు ఆనందం.. బాధ తెలుస్తుందా? అన్న‌ది అంతు ప‌ట్ట‌ని విష‌యాలు' అంటూ న‌వ్వేసారు. జ‌గ‌ప‌తి చాలా కొత్త విష‌యాలు మాట్లాడ‌టంతోనే ఇంట‌ర్వ్యూ నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. సినిమా విశేషాల‌కు భిన్నంగా ఈ ఇంట‌ర్వ్యూ హైలైట్ అవ్వ‌డం విశేషం.