Begin typing your search above and press return to search.

గొప్ప కాంబినేషన్ వేస్ట్ చేశారంటున్న జగ్గు భాయ్..!

మహేష్ చరిష్మా వల్ల సంక్రాంతి సీజన్ లో అలా నడిచిపోయింది కానీ మామూలు టైం అయితే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

By:  Tupaki Desk   |   9 April 2024 2:45 AM GMT
గొప్ప కాంబినేషన్ వేస్ట్ చేశారంటున్న జగ్గు భాయ్..!
X

ఈ సంక్రాంతికి వచ్చి కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకున్న సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమా బిజినెస్ లెక్కల ప్రకారం నిర్మాతకు డబ్బులు తెచ్చి పెట్టొచ్చు కానీ సినీ లవర్స్ ని మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అన్నది నమ్మాల్సిన నిజం. మహేష్ చరిష్మా వల్ల సంక్రాంతి సీజన్ లో అలా నడిచిపోయింది కానీ మామూలు టైం అయితే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. పబ్లిక్ కూడా సినిమాపై అలాంటి స్పందనే ఇచ్చారు.

అయితే అందరు అనడం వేరు ఆ సినిమాలో నటించిన నటుడు అనడం వేరు. మహేష్ గుంటూరు కారం పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు జగపతి బాబు. మహేష్ తో తాను ఎప్పుడు నటించడానికి ఇష్టపడతాను మా ఇద్దరిదీ గొప్ప కాంబినేషన్ కానీ గుంటూరు కారం లో అది వేస్ట్ చేశారని తన అసంతృప్తిని బయట పెట్టారు జగ్గు భాయ్. గుంటూరు కారం క్యారెక్టర్స్ ఇంకా బాగా రావాల్సి ఉందని.. తానైతే ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పుకొచ్చారు జగపతి బాబు.

మహేష్ తో తన కాంబినేషన్ ఎప్పుడూ బెస్ట్ గా ఉండాలని అనుకుంటాను. ఈ కాంబోని వేస్ట్ చేయాలని అనిపించదు. కానీ గుంటూరు కారం లో అదే జరిగింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు జగపతి బాబు. ఆయన సినిమా అంతా గందరగోళమైంది అని ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రం నే టార్గెట్ చేసినట్టు ఉన్నాడు. లెజెండ్ నుంచి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్న జగపతి బాబు మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాలో రిచ్ ఫాదర్ గా అదరగొట్టారు.

తనకు మహేష్ తో చేసే సినిమాలు చాలా గొప్పగా ఉండాలని అనుకుంటున్న జగపతి బాబు గుంటూరు కారం లో అసలేమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రలో నటింపచేయడం ఆయన్ను హర్ట్ చేసింది. కొన్ని సినిమాలు.. వాటిలోని పాత్రలు కథగా విన్నప్పుడు బాగుంటాయి కానీ సినిమా వచ్చాక అవి నిరాశ పరుస్తాయి. గుంటూరు కారం సినిమా రెండేళ్లకు పైగా తీయడం మధ్యలో గ్యాప్ రావడం కూడా సినిమా మొదట అనుకున్న కథ పక్కదారి పట్టిందన్న టాక్ కూడా వినిపించింది. అయినా సరే మహేష్ స్టామినా వల్ల డ్యామేజ్ పెద్దగా జరగలేదు. జగపతి బాబు ఆ సినిమా మీద కంప్లైంట్ లా కాదు కానీ మహేష్ తో తన కాంబో ఎంత స్పెషల్ అన్నది చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా అనిపిస్తుంది.