Begin typing your search above and press return to search.

నాశనమైపోవాలనే స్వార్థంతో విమర్శలు, ట్రోలింగ్స్ చేస్తున్నారు: జ‌గ‌ప‌తిబాబు

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తూ నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు.

By:  Sivaji Kontham   |   10 July 2026 9:33 AM IST
నాశనమైపోవాలనే స్వార్థంతో విమర్శలు, ట్రోలింగ్స్ చేస్తున్నారు: జ‌గ‌ప‌తిబాబు
X

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తూ నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు. `పెద్ది` త‌ర్వాత అత‌డు న‌టించి స్వ‌యంగా నిర్మించిన `వ‌ద‌లా` చిత్రం విడుద‌ల‌కు వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో అత‌డు ట్రోలింగ్ క‌ల్చ‌ర్ పై ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ``ఎదుటి సినిమా నాశనమైపోవాలనే స్వార్థంతో కొందరు విమర్శలు, ట్రోలింగ్స్ చేస్తున్నారు. దీనివల్ల సినిమాను ప్రాణంగా ఇష్టపడే మనమే బాధపడుతున్నాం. దయచేసి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలను వదిలేసి.. పాజిటివ్‌గా ఉంటూ చిత్ర పరిశ్రమను కాపాడుకుందాం`` అని ఆయన పిలుపునిచ్చారు. అలాగే `వ‌ద‌లా` లాంటి చిన్న‌ సినిమాను ఎవరూ ట్రోల్ చేయరని.. అంత సమయం ఎవరికీ లేదని.. తాము సేఫ్ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

జగపతి పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నిర్మించిన‌ సరికొత్త చిత్రం `వదలా`. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయతో పాటు హృతికా శ్రీనివాస్ కథానాయికలుగా నటించారు. ఎంతో కాలంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైల‌ర్ వేడుక‌లో జ‌గ‌ప‌తి ట్రోలింగ్ క‌ల్చ‌ర్ గురించి ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించారు.

ఇదే వేడుక‌లో `పెద్ది` స‌క్సెస్ గురించి మాట్లాడిన తీరుగానే `వ‌ద‌లా` సినిమా గురించి మాట్లాడ‌టం లేదు! అని జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు. తాను సాధారణంగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పనని.. కానీ గత సినిమా (పెద్ది) విషయంలో మనస్ఫూర్తిగా మాట్లాడానని చెప్పారు. ఆ సినిమాలో తన పాత్ర త‌నకు వ్యక్తిగతంగా చాలా నచ్చిందని..సినిమాను రూపొందించిన వారు ప్యాషనేట్ వ్యక్తులు కావడం వల్లే ఆ చిత్రం విజయవంతం కావాలని తాను బలంగా కోరుకున్నట్లు జగపతి బాబు వివరించారు.

ఇదే వేదికపై జగపతి బాబు నేటి తరం సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తూ నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటి సినిమా నాశనమైపోవాలనే స్వార్థంతో కొందరు విమర్శలు, ట్రోలింగ్స్ చేస్తున్నారు. దీనివల్ల సినిమాను ప్రాణంగా ఇష్టపడే మనమే బాధపడుతున్నాం. దయచేసి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలను వదిలేసి.. పాజిటివ్‌గా ఉంటూ చిత్ర పరిశ్రమను కాపాడుకుందాం! అని పిలుపునిచ్చారు.

ఇక ఈ సినిమాతో పాటు జగపతి పిక్చర్స్ భవిష్యత్తు ప్రణాళికలను కూడా జ‌గ‌ప‌తిబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. తాను సోలోగా సినిమా చేయాలని.. ఇద్దరు హీరోయిన్లు ఉండాలనే చిన్న స్వార్థంతోనే ఈ `వదలా` సినిమా చేశానని చమత్కరించిన జగపతి బాబు.. ప్రేక్షకులు ఈ సినిమా చూసి తమ ముఖాన కొట్టినా సరే వదలకుండా ఇంకో సినిమా చేస్తామని.. సినిమాలను మాత్రం అస్సలు వదలమని స్పష్టం చేశారు. అలాగే తమ బ్యానర్‌లో యువ హీరో అడవి శేష్, దర్శకుడు సాయిమార్తాండ్ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా ఉండబోతోందని ప్రకటించారు.