మెగాస్టార్-దత్ డేర్ చేయకపోతే ఆ బ్లాక్ బస్టర్ ఉండేది కాదు!
ఓ కొత్త వరల్డ్ లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిన చిత్రంగా నూ నిలిచింది.
By: Tupaki Desk | 5 May 2025 8:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వీనిదత్ ప్రతిష్టా త్మకంగా నిర్మించిన 'జగదీక వీరుడు అతిలోక సుందరి' ఎలాంటి విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటికీ ఇప్పటికీ అదో క్లాసిక్ సోషియా ఫాంటసీ చిత్రం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఓ కొత్త వరల్డ్ లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిన చిత్రంగా నూ నిలిచింది. నటుడిగా మెగాస్టార్ కు ఇమేజ్ ను పెంచిన చిత్రమది. అప్పట్లోనే ఈ చిత్రం 15 కోట్ల వసూళ్లను సాధించింది.
రెండు కోట్ల బడ్జెట్ తో వైజయంతీ సంస్థ నిర్మించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందు కొచ్చిందంటే అందుకు ప్రధాన కారకులు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్వీనిదత్ అని తెలుస్తోంది. ఈ సినిమా తెరకెక్కే సమాయానికే చిరంజీవి పెద్ద స్టార్. మెగాస్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నారు.
వైజయంతీ సంస్థ అంటే స్టార్ హీరోలతో మాత్రమే పనిచేస్తుంది. అప్పటికే ఎన్నో హిట్లు అందించిన సంస్థగా నిలిచింది. అయితే ఈసినిమా సినిమా చేసే సమయానికి రాఘేవంద్ర రావు వరుసగా రెండు, మూడు ప్లాప్ లతో ఉన్నారుట.
ఈ సమయంలో ఆయనతో సినిమా చేయడం పెద్ద తప్పు అవుతుందని చేయోద్దని చిరంజీవి, అశ్వీనిదత్ కి చాలా మంది చాలా రకాల సలహాలు ఇచ్చారుట. కానీ ఇలాంటి కథను డీల్ చేయగలిగే డైరెక్టర్ రాఘ వేంద్ర రావు మాత్రమేనని బలంగా నమ్మి చిరంజీవి పూనుకోవడంతోనే ఇది సాద్యమైందని చిరు మాటల్ని బట్టి తెలుస్తుంది. రాఘవేంద్రరావు సినిమాలు ప్లాప్ అయిన ఆయన మాత్రం ప్లాప్ కారు అనే నమ్మకంతో చేసామన్నారు.
'అయితే ఆ సినిమా ఛాన్స్ రాఘవేంద్రరావుకి ఇస్తున్నారా? లేదా? అని ఆయని అనుమానం ఉండేది. ఒకటి రెండుసార్లు సరదాగా అడిగేసారు కూడా. ఆయనే కాకపోతే జగదీకవీరుడు అతిలోక సుందరి గురించి ఈరోజు ఇలా మాట్లాడుకునే వాళ్లం కాదన్నారు.'ఫెయిల్యూర్ లో ఉన్న డైరెక్టర్ కి అంత పెద్ద కాంబినేషన్ సినిమా ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఇదంతా తెర వెనుక జరిగిన కథ. ఉన్నది నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నా. వాళ్లిద్దరికీ నా కృతజ్ఞతలు' అని రాఘవేంద్ర రావు తెలిపారు.
